Ariyana - Devi Nagavalli: బుల్లితెరపై ది బిగ్గెస్ట్ రియాలిటీ షోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్కరిని బాగా కనెక్ట్ అయ్యేలా చేసుకుంది. ఇక ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదవ సీజన్ కూడా ప్రసారమవుతుంది. ఈ షో వల్ల చాలామంది సెలబ్రెటీలకు మరింత పరిచయం పెరగడమే కాకుండా.. మంచి హోదాను కూడా అందిస్తుంది. ఇదిలా ఉంటే ఈ షోలో గత సీజన్ లో పాల్గొన్న ఇద్దరు కంటెస్టెంట్ లు దేవి నాగవల్లి, అరియానా తాజాగా కొత్త కార్లు కొన్నారు.
ఇది కూడా చదవండి: తెలివిలేని వంటలక్క, డాక్టర్ బాబు.. అదే సైకో ప్లాన్స్‌తో మోనిత ఎత్తుగడలు
టీవీ9 యాంకర్ గా పరిచయమైన దేవి నాగవల్లి బిగ్ బాస్ తర్వాత తానేమిటో నిరూపించుకుంది. అంతే కాకుండా మంచి అభిమానం సొంతం చేసుకుంది. ఈ షో తర్వాత ఈమె మళ్లీ యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. అంతేకాకుండా కొందరు కంటెస్టెంట్ లతో కూడా ఇప్పటికీ కూడా మంచి స్నేహంగా ఉంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది.
అందులో తను కొత్త కారు కొన్నట్లుగా కనిపించింది. ఇక ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ తను స్కోడా కార్ కొన్నట్లు తెలిపింది. ఇక ఈ కారు ధర దాదాపు రూ.25 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తుంది. మరోవైపు మరో బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా తాజాగా కొత్త కారు కొన్నట్లు తెలిసింది. ఈమె కూడా బిగ్ బాస్ ముందు యూట్యూబ్ లో యాంకర్ గా చేసింది. అసలు ఈమె ఇంత క్రేజ్ సంపాదించుకోడానికి కారణం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి.
View this post on Instagram
ఒక బోల్డ్ ఇంటర్వ్యూతో అరియానా తలరాతను మార్చేసాడు వర్మ. దాంతో ఈ బ్యూటీకి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం వచ్చింది. ఇందులో ఎంట్రీతో బాగా బోల్డ్ గా కనిపించింది. అంతేకాకుండా మొదట్లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో కూడా టామ్ అండ్ జెర్రీ లా ఉండేది. దాని తర్వాత వీరిద్దరే మంచి బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచారు. ఇక ఈ బ్యూటీ కూడా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది. అందులో తను కూడా కొత్త కారు కొనగా ఈ కారు కూడా లక్షల ధరలో ఉంటుందని అర్థమవుతుంది.
View this post on Instagram
దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ బాగా ఇందులో తన బెస్ట్ ఫ్రెండ్ సోహెల్ డ్రైవ్ చేస్తున్నట్లు కనిపించింది. అంతే కాకుండా మరో బుల్లితెర నటుడు అమర్ దీప్ కూడా ఉన్నాడు. ఇక ఈ బిగ్ బాస్ బ్యూటీ ఒకే రోజు కార్లు కొనడంతో ఇద్దరు అనుకుని కొన్నారా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ariyana glory, Bigg boss 5 buzz, Bigg boss season 4 telugu, Devi nagavalli