Bigg Boss 4: బిగ్‌బాస్ 4లో ఆ నలుగురు.. హోస్ట్‌గా ఆ స్టార్ హీరో..?

Bigg Boss 4: తెలుగులో బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ గేమ్ షోల్లో బిగ్‌బాస్‌ కూడా ఒకటి. తొలి సీజన్ సంచలనాలు సృష్టించింది.. రెండు మూడు పర్లేదనిపించాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 8:39 PM IST
Bigg Boss 4: బిగ్‌బాస్ 4లో ఆ నలుగురు.. హోస్ట్‌గా ఆ స్టార్ హీరో..?
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
  • Share this:
తెలుగులో బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ గేమ్ షోల్లో బిగ్‌బాస్‌ కూడా ఒకటి. తొలి సీజన్ సంచలనాలు సృష్టించింది.. రెండు మూడు పర్లేదనిపించాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం సిద్ధం అవుతున్నారు. అయితే కరోనా కారణంగా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది ఈ సారి షో. అన్నీ కుదిరితే జూలైలో బిగ్‌బాస్ 4ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. దీనికోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సారి మరింత భారీగానే బిగ్‌బాస్ 4 ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే ఇప్పట్నుంచే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరుగుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ నాని (Bigg Boss Hosts Nani Jr NTR)
జూనియర్ ఎన్టీఆర్ నాని (Bigg Boss Hosts Nani Jr NTR)


ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే నలుగురు కంటెస్టెంట్స్‌ను ఇప్పటికే ఫైనలైజ్ చేసారని తెలుస్తుంది. అందులో ఒకరు ఒకప్పటి లవర్ బాయ్ హీరో తరుణ్‌ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈయన పేరు మూడో సీజన్‌కు కూడా వినిపించింది. కానీ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది. ఇక సింగర్ కమ్‌ యాంకర్ మంగ్లీ.. మరో హాట్ యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్‌.. సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్‌ ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే నాలుగో సీజన్ హోస్ట్ విషయంలో కూడా ఇంకా కన్పర్మేషన్ రాలేదు.
హీరో తరుణ్ (Hero Tarun)
హీరో తరుణ్ (Hero Tarun)

మొదటి సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఉండగా.. శివబాలాజీ విజేతగా నిలిచాడు. రెండో సీజన్‌కి నాని వ్యాఖ్యతగా వ్యహరించగా.. కౌశల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది మూడో సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా కాగా.. రాహుల్ సింప్లిగంజ్‌ విన్నర్‌ అయ్యాడు. నాలుగో సీజన్ కోసం మహేష్ బాబును అడిగినా కూడా ఆయన నో చెప్పాడని తెలుస్తుంది. రవితేజ, విజయ్ దేవరకొండ పేర్లు వినిపించినా కూడా అది కూడా కుదర్లేదు. దాంతో మరోసారి నాగార్జున పేరే వినిపిస్తుంది. మొత్తానికి సీజన్ 4 మాత్రం కచ్చితంగా మునపటి సీజన్స్ కంటే భారీగా ఉండబోతుందనే విషయం మాత్రం అర్థమవుతుంది.


First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading