హోమ్ /వార్తలు /సినిమా /

Gangavva - Anchor Suma: బుల్లితెరపై రచ్చ రచ్చ చేస్తున్న గంగవ్వ.. అలా వచ్చి యాంకర్ సుమని అంత మాట అనేసిందిగా!

Gangavva - Anchor Suma: బుల్లితెరపై రచ్చ రచ్చ చేస్తున్న గంగవ్వ.. అలా వచ్చి యాంకర్ సుమని అంత మాట అనేసిందిగా!

Gangavva - Anchor Suma

Gangavva - Anchor Suma

Gangavva - Anchor Suma: బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంతోమంది కంటెస్టెంట్ లు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు అవకాశాలు కూడా అందుకున్నారు. ఇక వాళ్ల గురించి ప్రేక్షకులు కొంతవరకు మర్చిపోయారు కూడా. కానీ ఈ సీజన్ లో

Gangavva - Anchor Suma: బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంతోమంది కంటెస్టెంట్ లు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు అవకాశాలు కూడా అందుకున్నారు. ఇక వాళ్ల గురించి ప్రేక్షకులు కొంతవరకు మర్చిపోయారు కూడా. కానీ ఈ సీజన్ లో పాల్గొన్న సోషల్ మీడియా స్టార్ గంగవ్వను మాత్రం ఎవరూ మరిచిపోలేదనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తనేంటో తాను నిరూపించుకుంది. ఆమె తన ఇంట్లో ఎలా ఉండేదో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉండేది. నిజానికి గంగవ్వ ఇంత గుర్తింపు తెచ్చుకుంటుందని ఎవరు కూడా ఊహించుకోలేదు. బిగ్ బాస్ హౌస్ లో మొదట్లో అందర్నీ ఆశ్చర్యపరిచిన గంగవ్వ.. ఆ తర్వాత తన మైండ్ గేమ్ తో, తన పర్ఫామెన్స్ లతో బాగా నవ్వించింది.. ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ.

ఎక్కడో మారుమూల గ్రామం నుండి చిన్న ఇంట్లో ఉండే గంగవ్వ.. ప్రస్తుతం ఒక రేంజ్ లో ఎదిగింది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. యూట్యూబ్ లో తన గ్రామస్తులు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గంగవ్వను కూడా షార్ట్ ఫిలిమ్స్ లో పరిచయం చేశారు. అలా గంగవ్వ రేంజ్ బిగ్ బాస్ వరకు ఆ తరవాత సినిమాలలో అంతేకాకుండా స్టార్ హీరోలతో ముచ్చట్లు పెట్టే అవకాశాలు కూడా అందుకుంది.

ఇప్పటికీ యూట్యూబ్ లలో వీడియోలు చేస్తూ తన నటనతో అందర్నీ ఫిదా చేస్తుంది. బిగ్ బాస్ లో ఉన్నంతకాలం అందర్నీ తన పిల్లలుగా చూసుకుంది. ఎటువంటి ఎలిమినేషన్ లేకుండా తన ఇష్టంతోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. ఇక తాజాగా మరో బుల్లితెర షోలో పాల్గొని బాగా రచ్చ చేసింది. స్టార్ మాలో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

https://youtu.be/6y9mtc9ioW0

ఇందులో యాంకర్ సుమ హోస్టింగ్ చేస్తుంది. ఇక గంగవ్వతో పాటు మరో యూట్యూబ్ స్టార్స్ కూడా పాల్గొన్నారు. గంగవ్వ ఎంట్రీ బాగా స్టైల్ గా కనిపించడంతో పాటు తన డాన్స్ స్టెప్ లతో బాగా ఆకట్టుకుంది. సుమక్క అని గంగవ్వ అనడంతో వెంటనే సుమ.. అక్కనా .. అని షాక్ అయింది. సుమకు ప్రొపోజ్ చేస్తూ ముద్దులతో బాగా సందడి చేసింది. ఇందులో ఇంత వయసులో కూడా గంగవ్వ గట్టితనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారగా.. ఇందులో గంగవ్వను చూసిన నెటిజన్లు గంగవ్వ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తన యాక్టివ్ ను చూసి పొగుడుతున్నారు.

First published:

Tags: Anchor suma, Bigg boss season 4, Gangavaa, Start music, Tollywood

ఉత్తమ కథలు