హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 5 Telugu: షాకింగ్.. బిగ్ బాస్ హాస్ట్‌గా బోల్డ్ బ్యూటీ.. అప్పుడు కంటస్టెంట్.. ఇప్పుడు?

Bigg Boss 5 Telugu: షాకింగ్.. బిగ్ బాస్ హాస్ట్‌గా బోల్డ్ బ్యూటీ.. అప్పుడు కంటస్టెంట్.. ఇప్పుడు?

Bigg Boss 5 Telugu:  బుల్లితెరలో ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమవుతుంటాయి. అందులో ఎక్కువగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న షో బిగ్ బాస్. ఈ షో తెలుగుతో పాటు పలు భాషలతో ప్రసారమవుతున్నాయి.

  Bigg Boss 5 Telugu:  బుల్లితెరలో ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమవుతుంటాయి. అందులో ఎక్కువగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న షో బిగ్ బాస్. ఈ షో తెలుగుతో పాటు పలు భాషలతో ప్రసారమవుతున్నాయి. ఇక ఈ షోకు ప్రేక్షకులు కూడా బాగా అలవాటు పడుతున్నారు. ఇక తెలుగులో త్వరలోనే సీజన్ 5 ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా హోస్టింగ్ కి ఓ బోల్డ్ బ్యూటీ పేరు వినిపిస్తుంది.

  ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తి కాగా ఐదవ సీజన్ ఉంటుందో లేదో అని వార్తలు కూడా వచ్చాయి. గతేడాది కోవిడ్ కారణంగా సీజన్ 4 ఆలస్యం కావడంతో సీజన్ 5 ను త్వరగా ప్రారంభించాలని అనుకున్నారు. దీంతో కోవిడ్ సెకండ్ వేవ్ తో వాయిదా పడగా మళ్లీ ఈ షో ఉన్నట్టు ప్రకటించారు. ఇక జూమ్ ద్వారా కంటెస్టెంట్ లను ఎన్నుకున్నారని.. పైగా వాళ్ల పేర్లను కూడా ఇటీవలే బయట పెట్టడం కూడా జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ షోకు హోస్టింగ్ చేసేవారు ఎవరని కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

  గత నాలుగు సీజన్ లలో జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ కు మళ్లీ నాగార్జున పేరు వినిపించగా ఈమధ్య హీరో రానా హోస్టింగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత రెండు సీజన్ లలో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయగా నాలుగవ సీజన్ లో.. సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ సీజన్ కు ముందుగా సోహెల్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు ప్రకటించారు.

  ariyana glory
  ariyana glory

  కానీ తనకు వరుస ప్రాజెక్టులు ఉండటంతో డేట్స్ కుదరక పోవడంతో తాను తప్పుకున్నట్లు తెలిసింది. ఇక మరి ఈ సీజన్ కి పోస్టింగ్ చేయనున్న పర్సన్ ఎవరని ఆరా తీస్తే బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ బోల్డ్ బ్యూటీ ఈ అవకాశాన్ని కూడా అందుకోగా.. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.

  First published:

  Tags: Ariyana glory, Bigg Boss 5 Telugu, Bigg boss season 4, Nagarjuna Akkineni, Rana daggubati

  ఉత్తమ కథలు