BIGG BOSS RUNNER AKHIL SARDAK REAL LOVE MONAL GAJJAR POST GOES VIRAL ON INTERNET NR
Akhil - Monal Gajjar: 'మోనాల్'పై అఖిల్‌కి ఎంత ప్రేమో.. ఒక్క పోస్ట్‌లో చూపించేశాడుగా..?
Akhil - Monal Gajjar
Akhil - Monal Gajjar: బిగ్ బాస్ 4 సీజన్ లో గుర్తొచ్చే ప్రేమ జంట ఎవరంటే ఇట్టాగే చెప్పేస్తారు. ఎందుకంటే తమ ప్రేమ బిగ్ బాస్ హౌస్ వరకు మాత్రమే పరిమితం కాలేదు.
Akhil - Monal Gajjar: బిగ్ బాస్ 4 సీజన్ లో గుర్తొచ్చే ప్రేమ జంట ఎవరంటే ఇట్టాగే చెప్పేస్తారు. ఎందుకంటే తమ ప్రేమ బిగ్ బాస్ హౌస్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. బయట కూడా వాళ్ల ప్రేమ ఏంటో నిరూపించుకుంటున్నారు మోనాల్, అఖిల్. ఇక ఈ జంట ప్రస్తుతం ఎంత రచ్చ చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే తాజాగా మోనాల్ పై అఖిల్ తనలో ఉన్న ప్రేమను బయట పెట్టాడు.
మే 13న మోనాల్ తన పుట్టిన రోజును ఎంతో సందడిగా జరుపుకుంది. ఇక ఆమెకు సోషల్ మీడియా వేదిక ద్వారా ఎంతోమంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందరిలానే సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేయగా.. అందులో రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా అంటూ.. కానీ రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వే అంటూ మోనాల్ పై ఉన్న ప్రేమను చూపించాడు.
అంతేకాకుండా ఆమె గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్నవి అని, ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని తనపై ఉన్న ప్రేమను పంచుకున్నాడు. ఇక మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థాంక్స్ అని చెప్పాడు. ఇక తను భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇక చివర్లో ప్రేమతో జై కృష్ణ జై శ్రీ రామ అంటూ ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారగా.. నెటి జనులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మోనాల్ పై అఖిల్ కి ఇంత ప్రేమ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.