Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. ఇక ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో అట్ఠహాసంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌గా బిగ్‌బాస్ ఓటీటీని నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా ప్రసారం కానుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దారు.లక్షలు ఖర్చు పెడుతూ బిగ్‌బాస్ అనే గేమ్ గెలిచెయ్యాలని ఒకరిపై మరొకరు డిజిటల్ మీడియాని అడ్డం పెట్టుకుని బురదని చల్లటానికి బాగానే కుస్తీ పడుతున్నారని బయట ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెలిసి పోతుంది.
అందులో తెలివిగా వ్యవహరిస్తూ ముందుండే బిందు మాధవి టీం మెల్లమెల్లగా ఒక్కొక్క కంటెస్టెంట్‌లపై డిజిటల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ వాడకూడని పదాలు వాడుతూ సైబర్ క్రైం కేసుల్లో చిక్కుకున్నారు. ఆ సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్ ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లు తమ ఆటని తాము పొగుడుకోవాలి గానీ ఇంకొకరి భార్యల్ని, పిల్లల్ని, కుటుంబాల్ని బయట నుంచి దూషించడం తగదని పిలిచి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అఖిల్, నటరాజ్ మాస్టర్, అషూరెడ్డి, మహేష్‌లకి ఈ తెలివితేటలు లేకపోవటంతో బిందుమాధవి డిజిటల్ టీం వీళ్లని నెగిటివిటీతో టార్గెట్ చేసిందని చెబుతున్నారు.
తమ టీంతోనే తిట్లు, శాపనార్థాలు కామెంట్లుగా పెట్టిస్తున్నారని తెలుస్తుంది. నటరాజ్ ఆటని అతనిలోని వేడిని చూస్తుంటే, అతని ఫిల్మీ కటౌట్ బిగ్ స్క్రీన్‌కి సరిపోతుందని, అతనికి వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వచ్చాయని తెల్సింది. ఈ నటరాజ్‌లో గతంలో అచ్చు ఇలానే ముక్కు సూటిగా ఆడిన సన్నీ లక్షణాలు ఇతనిలో కనబడుతున్నాయి. నటరాజ్ గతంలో కొంతమందికి తనకు తోచినంత మందికి తోచినట్లు దానాలు చేశాడని.. అతనికి జాలి గుణం బాగానే ఉందని వార్తలు బానే వినబడ్డాయి. అటు ‘జీ’ ఛానల్ వాళ్ల ఈవెంట్స్, ఇటు ‘మా’ ఛానల్ వాళ్ల ఈ వెంట్స్ బిజీ బిజీగా చేస్తూ తిరిగే ఈ నటరాజ్ ఈ బిగ్‌బాస్ రొంపిలో ఎందుకు దిగాడో అర్థం కావడం లేదంటున్నారు.
KGF Chapter 2 Movie Review : కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ రివ్యూ.. యాక్షన్‌తో కుమ్మేసిన రాఖీ భాయ్..
ఇది అతని స్థాయి తగని పని అంటున్నారు. ఏది ఏమైనా వీళ్ల కొట్లాడటాలు చూసే ఈ పిచ్చి జనాలు అవి నిజమైన గొడవలు అని, వాళ్ల ఆవేశాలు, ఆరాటాలు, బాధలు, ఏడ్పులు అన్నీ నిజాలే అని నమ్ముతూ సీరియస్‌గా కామెంట్‌లు చేసేస్తూ ఉంటారు. ఏది ఏమైన అది ఒక ఆట మాత్రమే, వాళ్లెవరు విలన్‌లు కారు.. హీరోలు కాదు.. అంతా బిగ్‌బాస్ నడిపే స్క్రీన్ ప్లే. ఇందులో కంటెస్టెంట్‌లే కాదు ప్రేక్షకులు కూడా తెలియక నమ్మేస్తుంటారు. అఖిల్ ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆడటం అతనికి మైనస్. మహేష్ ఆట కూడా మోహమాటంగానే ఆడతాడు. కాస్త యాక్టివ్‌గా ఉంటే బెటర్ కామెంట్స్ వినబడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg boss ott telugu, Star Maa, Tollywood