Home /News /movies /

BIGG BOSS OTT MITHRA SHARMA WHO CONTESTANT WHO IMPRESSES EVERYONE IN BIG BOSS OTT WHO ELSE HERE ARE THE DETAILS TA

Bigg Boss OTT : బిగ్‌బాస్ ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంటున్న మిత్రా శర్మ..

బిగ్‌బాస్ ఓటీటీలో దూసుకుపోతున్న మిత్రా శర్మ (Twitter/Photo)

బిగ్‌బాస్ ఓటీటీలో దూసుకుపోతున్న మిత్రా శర్మ (Twitter/Photo)

Bigg Boss OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేది ఎవరైనా ఉన్నారంటే... అది మిత్రా శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఈమె బిగ్‌బాస్ ఓటీటీ విజేతగా నిలిచే అవకాశాలున్నాయి.

ఇంకా చదవండి ...
    Bigg Boss OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. ఇక ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత ఫిబ్రవరి 26 నుంచి  డిస్నీ హాట్ స్టార్‌లో  అట్ఠహాసంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌గా బిగ్‌బాస్ ఓటీటీని నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా  ప్రసారం కానుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దారు.లక్షలు ఖర్చు పెడుతూ బిగ్‌బాస్‌ అనే గేమ్‌ గెలిచెయ్యాలని ఒకరిపై మరొకరు డిజిటల్‌ మీడియాని అడ్డం పెట్టుకుని బురదని చల్లటానికి బాగానే కుస్తీ పడుతున్నారని బయట ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో  తెలిసి పోతుంది.

    బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేది ఎవరైనా ఉన్నారంటే... అది మిత్రా శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్న మిత్రా శర్మ బిగ్ బాస్ రియాలిటీ షోలో మెరిసింది. అయితే గత నామినేషన్ల ప్రక్రియ నుంచి హోస్ట్ నాగార్జున నిర్వహించే వీకెండ్ షో వరకు ఆమె ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది. అయితే నాగార్జున వేదిక మీద పంపించిన ఫోటో చూసి మిత్రా శర్మ ఎమోషనల్ కంటతడి పెట్టుకొన్నారు. అయితే ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే...గతవారం నామినేషన్ల ప్రక్రియ విషయంలో తనను టార్గెట్ చేసిన బిందు మాధవి చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది. అయితే టాస్క్ ఆడుతున్న సమయంలో తనకు వెన్నునొప్పి ఉందని చెబితే.. దానిని తప్పుడు విధంగా చెబుతూ మిత్రా శర్మ వెన్నుముకకు సర్జరీ, ఆపరేషన్ చేసిన ఆరోపణలను నాగార్జున తప్పుపట్టారు. బిందుమాధవి టార్గెట్ చేయడాన్ని మిత్ర బలంగా తిప్పి కొట్టింది.

    మిత్రా శర్మ (Twitter/Photo)


    మిత్రా శర్మను ఉద్దేశించి బిందు మాధవి చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏదైనా ఏమైనా విషయం చెబితే.. వాటిని ఊహించుకోవద్దు అని నాగార్జున సలహా ఇంటి సభ్యులకు ఇచ్చారు. అయితే వేదికపైకి కంటెస్టెంట్లుకు ఇంటి సభ్యులను పిలిచి ఫన్ గేమ్ ఆడించారు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న మిత్రాశర్మకు తన తండ్రి ఫోటోను పంపించడంతో మిత్రా శర్మ ఎమోషనల్ అయ్యారు.నాగార్జున పంపిన తన తండ్రి ఫోటోను చూసి మిత్రాశర్మ భోరున విలపించింది. ఇంటిలోకి అందరి కుటుంబ సభ్యులు వస్తుంటే.. నా ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడంపై ఆవేదన చెందారు. నాకు నా అనే వాళ్లు లేరు అని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇలాంటి భావోద్వేగమైన క్షణాల్లో మిత్రాశర్మకు ఇష్టమైన సిరి హన్మంతు, గంగాధర్‌ను పరిచయం చేశారు. వారిని చూడగానే మిత్రాశర్మ ఎమోషనల్ అయ్యారు.

    Pooja Hegde : హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోన్న పూజా హెగ్డే..


    తనను చూడటానికి వచ్చిన గంగాధర్‌ గురించి మాట్లాడుతూ మిత్రాశర్మ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు. నాకు అన్నయ్య లాంటి వారు అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. వారిద్దరని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని మిత్రాశర్మ చెప్పారు. ఆమె గురించి గంగాధర్ మాట్లాడుతూ.. ఆమె సివంగి. అలానే ఇంటిలో ఆడుతున్నది. బయట ఎలా ఉంటుందో.. ఇంటిలో కూడా అలానే ఉంది. షోలో బాగా ఆడుతున్నది అని గంగాధర్ చెప్పారు. ఇక మిత్రా గేమ్ గురించి సిరి హన్మంతు కూడా ప్రశంసలు కురిపించిది. టాప్ 5లో ఉండటం ఖాయం అని సిరి హన్మంతు జోస్యం చెప్పింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bigg boss ott telugu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు