BIGG BOSS NON STOP TELUGU TITLE WINNER A RUMOUR GOES VIRAL ON SOCIAL MEDIA SR
Bigg Boss Non Stop Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో తెలిసింది.. షాక్ అవ్వాల్సిన విషయమే..
Bigg Boss Nonstop Photo : Twitter
Bigg Boss Non Stop Telugu : ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత మరో ఫార్మాట్.. ఫిబ్రవరి 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యిన సంగతి తెలిసిందే (Bigg Boss Telugu OTT). దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా చేస్తున్నారు.
Bigg Boss Non Stop Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా విజయ వంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత మరో ఫార్మాట్.. ఫిబ్రవరి 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యిన సంగతి తెలిసిందే (Bigg Boss Telugu OTT). దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ షో దాదాపు ముగింపు దశకు వచ్చింది. హౌజ్‌లోకి 17 మంది కంటెస్టెంట్స్ వస్తే.. చివరకు ఏడుగురు కంటెస్టెంట్ లతో మిగిలిపోయింది. మొన్నటి వరకు హౌజ్‌లో ఎనిమిది మంది ఉండగా... లాస్ట్ వీక్ నామినేషన్లో భాగంగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌజ్‌లో మిగిలిన వారి విషయానికొస్తే.. అనిల్ రాథోడ్, మిత్రశర్మ, అరియనా గ్లోరీ, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవిలు ఉన్నారు.
ఇందులో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే.. అయితే వీరిలో భిందు మాధవి (Bindu Madhavi) టైటిల్ విన్ అయ్యిందని అంటున్నారు. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బింధు మాధవికి ఓట్లు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఒకవేళా అదే నిజమైతే బింధు మాధవి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన మొదటి మహిళ కంటెస్టెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఏడుగురు ఎవరి గెలుపు కోసం వారు తమదైన స్టైల్లో టైటిల్ గెలవడానికి పోరాడుతున్నారు.
— BbTeluguNonstop ⱽᵒᵗᵉᶠᵒʳᴮᴵᴺᴰᵁ (@bb_nonstop) May 19, 2022
ఇక ఈ ఫైనాలే కార్యక్రమానికి ప్రత్యేకంగా గెస్ట్‌లు ఎవరు రాకపోవచ్చని తెలుస్తోంది. నాగార్జున మాత్రమే ఉంటారని.. ఆయనే టైటిల్ విన్నర్‌కు ట్రోఫీని అందిస్తారని టాక్ నడుస్తోంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షో విజేతకు టైటిల్‌తో పాటు 25లక్షల ప్రైజ్ మనీ అందోచ్చని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ నాన్ స్టాప షో.. రెగ్యూలర్‌గా వచ్చే బిగ్ బాస్ షో రేంజ్లో మాత్రం పాపులర్ కాలేదనే అంటున్నారు. అయితే ఈ షోలో పాల్గోన్న కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం బాగా హైలెట్ అయ్యారు. అందులో ముఖ్యంగా అజయ్, ఆర్జే చైతూ, అనిల్ రాథోడ్ , మిత్రా శర్మా, యాంకర్ శివలు ముఖ్యంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ నాన్ స్టాప్ నుంచి కొంతమందిని బిగ్ బాస్ సీజన్ 6కు తీసుకోబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అందులో వీరు ఉండబోతున్నట్లు తాజా టాక్. బిగ్ బాస్ తెలుగు 6ను జూలై 31వ తేది లేదా ఆగష్టు 7న మొదలు పెట్టాలనీ చూస్తోందట టీమ్.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.