హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss Non Stop: విన్నర్‌గా బిందు మాధవి.. మరోసారి రన్నరప్‌గా అఖిల్..

Bigg Boss Non Stop: విన్నర్‌గా బిందు మాధవి.. మరోసారి రన్నరప్‌గా అఖిల్..

Bigg Boss Non Stop Photo : Twitter

Bigg Boss Non Stop Photo : Twitter

Bigg Boss Non Stop Telugu : అందురూ అనుకున్నట్లే ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌’ (Bigg boss non stop) మొదటి సీజన్‌ టైటిల్ విన్నర్‌గా బిందు మాధవి (Bindu Madhavi) నిలిచారు. అఖిల్‌ సార్థక్‌‌తో పోటీ పడుతూ చివరకు టైటిల్ విన్నర్‌గా నిలిచారు బిందు మాధవి. అంతేకాదు ప్రైజ్‌మనీ రూ.40లక్షలు సొంతం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...

Bigg Boss Non Stop Telugu : అందురూ అనుకున్నట్లే ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌’ (Bigg boss non stop) మొదటి సీజన్‌ టైటిల్ విన్నర్‌గా బిందు మాధవి (Bindu Madhavi) నిలిచారు. అఖిల్‌ సార్థక్‌‌తో పోటీ పడుతూ చివరకు టైటిల్ విన్నర్‌గా నిలిచారు బిందు మాధవి. అంతేకాదు ప్రైజ్‌మనీ రూ.40లక్షలు సొంతం చేసుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమంటే తెలుగుకు సంబంధించి ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షో అన్ని సీజన్‌లలో ఒక్కసారి కూడా ఉమెన్‌ కంటెస్టెంట్‌ టైటిల్ విన్నర్‌గా గెలవలేదు. మొదటి సారి బిందు మాధవి తనదైన ఆటతీరుతో కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఇక ఈ పోటీలో బిందు మాధవి, అఖిల్ సార్థక్‌, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మలు టాప్‌ ఫైవ్‌లో ఉండగా.. బిందు మాధవి ఆడియెన్స్ మనస్సును దోచుకున్నారు.. విన్నర్‌గా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో ఎఫ్3 టీమ్ దర్శకుడు అనిల్‌ రావిపూడి, సునీల్‌ డబ్బుతో నిండిన సూట్‌కేసును తీసుకురాగా.. డబ్బులు తీసుకునేందుకు అరియానా, శివ ముందుకు వచ్చారు. తనకు ఇల్లు కొనక్కుకోవడానికి డబ్బులు అవసరం అంటూ అరియానా రూ.10లక్షలు ఉన్న సూట్‌ కేసును తీసుకున్నారు. అఖిల్ మరోసారి రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఈ కొత్త ఫార్మాట్‌లో మొత్తం 18మంది కంటెస్టెంట్‌లు పాల్గోన్నారు. అజయ్‌ కుమార్‌, అఖిల్‌ సార్థక్‌, బిందు మాధవి, హమీదా, మహేష్ విట్టా, ముమైత్‌ ఖాన్‌, తేజస్విని మదివాడ, శ్రీ రాపాక, అరియానా, శివ, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అనిల్‌ రాథోడ్‌, మిత్రా శర్మ, బాబా భాస్కర్‌, నటరాజ్‌మాస్టర్‌, అషురెడ్డి, సరయు కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సరికొత్త ఫార్మాట్ మొదటి సీజన్ 84 రోజుల పాటు నడిచింది.

ఇక ఈ షో విషయానికి వస్తే.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా విజయ వంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత మరో ఫార్మాట్.. ఫిబ్రవరి 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ (Bigg Boss Telugu OTT) ప్రారంభం అయ్యింది.

దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా చేశారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ నాన్ స్టాప షో.. రెగ్యూలర్‌గా వచ్చే బిగ్ బాస్ షో రేంజ్‌లో మాత్రం పాపులర్ కాలేదనే అంటున్నారు. అయితే ఈ షోలో పాల్గోన్న కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం బాగా హైలెట్ అయ్యారు. అందులో ముఖ్యంగా అజయ్, ఆర్జే చైతూ, అనిల్ రాథోడ్ , మిత్రా శర్మా, యాంకర్ శివలు ముఖ్యంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ నాన్ స్టాప్ నుంచి కొంతమందిని బిగ్ బాస్ సీజన్ 6కు తీసుకోబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అందులో వీరు ఉండబోతున్నట్లు తాజా టాక్. బిగ్ బాస్ తెలుగు 6ను జూలై 31వ తేది లేదా ఆగష్టు 7న మొదలు పెట్టాలనీ చూస్తోందట టీమ్.

First published:

Tags: Bigg boss ott telugu, Bindu Madhavi, Tollywood news

ఉత్తమ కథలు