Bigg Boss: పెళ్లి చేసుకుంటున్న బిగ్‌బాస్ ప్రేమజంట...త్వరలోనే వివాహ తేదీ ప్రకటన

బిగ్‌బాస్‌లో హౌస్‌మేట్స్ మధ్య గిల్లికజ్జాలు, ప్రేమలు చిగురించడం చాలా కామన్. తెలుగులో సైతం ఈ ధోరణి ప్రారంభం అయ్యింది. మూడో సీజన్‌లో రాహుల్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ను బాగా కనెక్ట్ చేసింది.

news18-telugu
Updated: October 22, 2019, 6:20 PM IST
Bigg Boss: పెళ్లి చేసుకుంటున్న బిగ్‌బాస్ ప్రేమజంట...త్వరలోనే వివాహ తేదీ ప్రకటన
బిగ్‌ బాస్ లోగో (Twitter/Photo)
  • Share this:
బిగ్‌బాస్ సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య గిల్లికజ్జాలు, ప్రేమలు చిగురించడం చాలా కామన్. తెలుగులో సైతం ఈ ధోరణి ప్రారంభం అయ్యింది. మూడో సీజన్‌లో రాహుల్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ను బాగా కనెక్ట్ చేసింది. అయితే అలాంటి కెమిస్ట్రీనే ఇతర బిగ్ బాస్ సీజన్లలో సైతం కొనసాగింది. తాజాగా కన్నడ బిగ్‌బాస్ సీజన్ ఆరులో పాల్గొన్న చందన్ శెట్టి, నివేదితా గౌడల పరిచయం ప్రేమగా మారింది. వీరు బిగ్‌బాస్ సీజన్-6లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కలిసివచ్చింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా  వీరి ప్రేమ కొనసాగింది. ఇటీవల దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మైసూరులో ఓ వేదికపై తమ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా చందన్, నివేదితల బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని వారిద్దరూ తెలిపారు.
Published by: Krishna Adithya
First published: October 22, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading