• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS IN NEWS AGAIN AS SENIOR POLITICIAN CPI NARAYANA WANTS TO GO TO COURT AGAINST IT MHN

Bigg Boss - Nagarjuna Akkineni: బిగ్‌బాస్‌పై హైకోర్టులో కేసు వేస్తానంటూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసిన సీనియర్‌ రాజకీయ నేత.. ఎందుకు?

Bigg Boss - Nagarjuna Akkineni: బిగ్‌బాస్‌పై హైకోర్టులో కేసు వేస్తానంటూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసిన సీనియర్‌ రాజకీయ నేత.. ఎందుకు?

Bigg Boss in news again as senior politician CPI Narayana wants to go to court against it

Bigg Boss - Nagarjuna Akkineni: తెలుగులో ప్రసారమైన రియాలిటీ షో బిగ్‌బాస్‌ క్యారక్రమంపై, హోస్ట్‌గా చేసిన అక్కినేని నాగార్జునపై సీనియర్‌ రాజకీయ నాయకుడు, సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    తెలుగులో ప్రసారమైన రియాలిటీ షో బిగ్‌బాస్‌ క్యారక్రమంపై, హోస్ట్‌గా చేసిన అక్కినేని నాగార్జునపై సీనియర్‌ రాజకీయ నాయకుడు, సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హైకోర్టులో కేసు వేస్తానని అన్నారు. అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. రీసెంట్‌గానే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగిసింది. హీరో అభిజీత్‌ అందులో విజేతగా నిలిచాడు. సీజన్‌ ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ రగడ ప్రారంభమైంది.ఆదివారం తిరుపతిలో నారాయణ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణ బిగ్‌బాస్‌ షో గురించి ఘాటుగా స్పందించారు. సీనియర్‌ అగ్ర కథానాయకుడు, బిగ్‌బాస్‌ క్యారక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున తీరుని నారాయణ ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ "నాగార్జున అంటే నాకెంతో అభిమానం. సినిమా నటుడిగానే. అయితే బిగ్‌బాస్‌ షోలో ఆయన ఛండాలంగా వ్యవహరించారు. షోలో మగ్గురు అమ్మాయిల ఫొటోలు పెట్టి అభిజీత్‌ను పిలిచి.. ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్‌ చేస్తావు.. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. ఆ అబ్బాయి ఏమో ఓపెన్‌గా సమాధానం చెబుతున్నాడు.

    ముగ్గురు అమ్మాయిల గురించి అలా మాట్లాడటం మంచిదేనా? మరి నాగార్జున ఇంట్లో కూడా సినిమా యాక్టర్స్‌ ఉన్నారుగా.. మరి వాళ్ల బొమ్మలు పెట్టొచ్చుగా.. ఎందుకు వేరు అమ్మాయిల బొమ్మలు పెట్టాడు. ఇది మహిళా లోకానికి అన్యాయం చేసినట్లు కాదా. దీనికి సంబందించి నేను పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెడితే వాళ్లు తీసుకోలేదు. స్థానిక కోర్టులో కేసు తీసుకోలేదు. జిల్లా కోర్టులో కూడా కేసు తీసుకోలేదు. త్వరలోనే హైకోర్టులో కేసు వేయబోతున్నాం. మనది మాతృభూమి. ఇలాంటి చోట మహిళలను కించపరచడం పద్ధతి కాదు. బిగ్‌బాస్‌ వెనుక ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఉండొచ్చు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడతారా? దిగుజారుడు పనులు ఇలాంటి కళాకారులు చేయకూడదు" అన్నారు.

    బిగ్‌బాస్‌ గురించి సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్తకాదు. ఇది వరకు చాలా సందర్భాల్లో ఆయన బిగ్‌బాస్‌ కార్యక్రమం మంచిది కాదని తెలిపారు. ఈసారి కూడా తనదైన శైలిలోనే ఆయన తన స్పందనను తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై అటు బిగ్‌బాస్‌ నిర్వాహకులు, నాగార్జున ఎప్పుడూ స్పందించలేదు. మరి ఈసారైనా స్పందిస్తారేమో చూడాలి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు