Home /News /movies /

BIGG BOSS HOST NAGARJUNA AKKINENI DO YOU KNOW ABOUT REAL COST OF NAGARJUN SHIRT TA

Nagarjuna - Bigg Boss : ‘బిగ్‌బాస్’ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ధర ఎంతో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..

బిగ్‌బాస్‌లో నాగార్జున ధరించే షర్ట్ ధర (Twitter/Photo)

బిగ్‌బాస్‌లో నాగార్జున ధరించే షర్ట్ ధర (Twitter/Photo)

Nagarjuna - Bigg Boss : ‘బిగ్‌బాస్’ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ధర ఎంతో తెలిస్తే.. అవాక్కవాల్సిందే.. అవును నాగార్జున మూడోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షోలో నాగార్జున వేసుకున్న షర్ట్ ధర ఎపుడు హాట్ టాపిక్‌గా మారింది.

    Nagarjuna - Bigg Boss : ‘బిగ్‌బాస్’ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ధర ఎంతో తెలిస్తే.. అవాక్కవాల్సిందే.. అవును నాగార్జున మూడోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో ‘ బిగ్‌బాస్’. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సారి మాత్రం షోకు కాస్త తక్కువ రేటింగ్స్ నమోదు చేస్తోన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ షో ముందుగా హిందీ ప్రేక్షకులను అలరించింది. ఆ తరవాత నెమ్మది నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్  (NTR Jr )ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని (Natural Nani) హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు  మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఐదోసారి బిగ్‌బాస్ సీజన్ 5ను  నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో యాంకర్ రవి, గాయకుడు శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్‌, వీజే, మానస్ సన్ని వీళ్లలో విజేతలుగా నిలుస్తారనేది చూడాలి.

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఇప్పటి వరకు తొమ్మిది మంది కంటెస్టెంట్స్‌ ఈ రియాలిటీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. తొమ్మది మందిలో ఆరుగురు లేడీ కంటెస్టెంట్స్ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. తెలుగులో గత నాలుగు సీజన్లు హిట్ టాక్ తెచ్చుకోగా.. ఐదో సీజన్ మాత్రం కాస్త ఏటికి ఎదురీదుతోంది. వీక్‌ డేస్‌లో ఎంతో కొంత రేటింగ్ రాబడుతుండగా.. వీక్ డేస్‌లో ఈ షో రేటింగ్ మరీ వీక్ అయిపోయింది. రాత్రి 10 గంటలకు ఈ షోను ప్రసారం చేస్తుండటంతో ఈ షోను చూసే ప్రేక్షకులు రాను రాను తగ్గి పోతున్నట్టు సమాచారం.

    Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

    హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్ కూడా పెద్దగా అలరించలేకపోతున్నారనే టాక్ ఉంది. ఇక ఈ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ఖరీదు ఓ రేంజ్‌లో ఉందట. 62 యేళ్ల వయసులో కూడా నాగార్జున యంగ్ లుక్‌తో ఈషోను రన్ చేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నాగార్జునను ఇద్దరు కొడుకులు హీరోలంటే ఎవరు నమ్మరు. ప్రతి వారం శని, ఆది వారాల్లో నాగ్ ధరించే ఎట్రీ పైస్లీ సిల్క్ షర్ట్ (Etro Paisley Silk Shirt)లో కనిపించారు. ఈ అంగీ (షర్ట్) ఖరీదు నెటిజన్లు సెర్చ్‌లో చేయగా.. $310 డాలర్లు ఉంది.

    BalaKrishna - Nani : నందమూరి బాలకృష్ణకు నాని మధ్య ఉన్న ఈ అనుబంధం తెలుసా..


    మన భారతీయ రూపాయాల్లో చెప్పాలంటే.. అక్షరాల 83,908 రూపాయలు. మొత్తంగా నాగార్జున ఈ షో కోసం ఇంత పెద్ద మొత్తంలో ఉన్న షర్టు వేసుకోవడం అవసరమా అని కొంత మంది కామెంట్స్ చేస్తే.. ఇలాంటి షోలకు ఎంత పెట్టినా.. తక్కువే అంటూ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇపుడు బిగ్‌బాస్ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున ఈ యేడాది ‘వైల్డ్ డాగ్’ మూవీతో పలకరించారు. ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ మూవీతో పలకరించనున్నారు. దాంతో పాటు ’బంగార్రాజు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Bigg Boss 5, Nagarjuna Akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు