Bigg Boss: బిగ్ బాస్ టీమ్ బోల్డ్ స్టెప్.. ముందుగా వూట్‌ యాప్‌లో ప్రసారం..

Bigg Boss OTT Logo : Twitter

Bigg Boss: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ సీజన్ 15 ఈ సారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

  • Share this:
    బిగ్ బాస్ రియాలిటీ షోస్ దేశంలో ఎంత పాపులరో తెలిసిందే. బిగ్ బాస్ రియాలిటీ షో ఇటు హిందీతో పాటు అటు అన్ని ప్రధాన ప్రాంతీయ భాషాల్లోను ప్రసారం అవుతోంది. హిందీలో ఈ షోస్ వయాకామ్ 18‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా బిగ్ బాస్ కలర్స్ ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ షో ఈసారి డైరెక్ట్‌గా కలర్స్ ఛానల్‌లో ప్రసారం కాదని తెలుస్తోంది. ఆరు వారాల గ్యాపుతో ప్రసారం కానుందట. మొదట ఈ షో వయాకామ్ 18 సంస్థ ఓటీటీ యాప్‌ వూట్‌లో ప్రసారం కానుందట. వూట్‌లో ఎప్పటికప్పుడు అన్ని ఎపిసోడ్స్ ప్రసారం అవుతాయట. అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన కట్స్‌తో కూడిన ఎపిసోడ్స్, వీడియో క్లిప్స్ కూడా వూట్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది వయాకామ్ సంస్థ. మిగితా సీజన్స్ లాగా తాజా తాజా ఎపిసోడ్స్ కలర్స్ ఛానల్‌లో ప్రసారం కావు. ఈ సారి ఆరు వారాల గ్యాపు ఉండబోతుందట. అయితే వూట్ ఓటీటీ యాప్‌లో మాత్రం ఈ ఎపిసోడ్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. అంతేకాదు ఈ వూట్ యాప్ ద్వారా పూర్తిగా ఇంటరాక్టివ్ 24 * 7 లైవ్ ఫీడ్ చూడటానికి అవకాశం లభిస్తుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 15 ఆగస్టులో ప్రారంభంకానుంది.

    ఈ కొత్త సదుపాయం గురించి వయాకామ్ 18 డిజిటల్ వెంచర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ రక్షీత్ మాట్లాడుతూ, “టివికి ముందు బిగ్ బాస్ ఒటిటిని ప్రత్యేకంగా వూట్‌లో ప్రారంభించడం అనేది డిజిటల్ ఎంటర్టైన్మెంట్‌లో ఓ గేమ్-ఛేంజర్‌గా ఉండబోతుందని తెలిపారు. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా వూట్ యాప్ అత్యంత ప్రియమైన వినియోగదారుల వినోద బ్రాండ్‌గా తన స్థానాన్ని మరింతగా పదిలంగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ”OTT ఎక్స్‌క్లూజివ్ ఆగస్టులో ప్రారంభమవుతుండగా, బిగ్ బాస్ మొదట వూట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిజిటల్‌లో ఆరు వారాల ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్ తర్వాత, షో 15 వ సీజన్‌లో COLORS లో ప్రసారం ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక వయాకామ్ 18 హిందీ మాస్ ఎంటర్టైన్మెంట్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ మనీషా శర్మ మాట్లాడుతూ, “ఈ కొత్త డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ ఫార్మాట్ షో ప్రేక్షకుల అభిమానాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని తెలిపారు.
    Published by:Suresh Rachamalla
    First published: