Bigg Boss: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ జోడి..

Bigg Boss | బిగ్‌బాస్ ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ రియాలిటీ షో ముందుగా మన దేశంలో  హిందీ ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ షోలో పాల్గొన్న ఓ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది.

news18-telugu
Updated: April 7, 2020, 3:50 PM IST
Bigg Boss: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ జోడి..
బిగ్ బాస్ లోగో Photo : Twitter
  • Share this:
బిగ్‌బాస్ ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ రియాలిటీ షో ముందుగా మన దేశంలో  హిందీ ప్రేక్షకులను పలకరించింది. అక్కడ ఈ రియాలిటీ షో సూపర్ హిట్ కావడంతో ఆయా ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు  ఈ ప్రోగ్రామ్‌ను చూసేవాళ్లు ఎంతమంది అయితే ఉన్నారో.. ఈ ప్రోగ్రామ్‌ మన దేశ సభ్యత సమస్కారాలను నాశనం చేస్తుంది అనే వాళ్లు లేకపోలేదు. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసే ఆడ, మగ వాళ్లు అందరు ఒకరి నొకరు హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి కొంత అతి కూడా ఉంది. బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా ఈ అతితోనే టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటున్నారు. ఐతే షోలోనే పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కొందరు ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం కూడా జరిగాయి.

bigg boss hindi jodi priyank sharma and benafsha soonawalla fall in love
బిగ్‌బాస్ జోడి (File/Photo)


తాజాగా హిందీ బిగ్‌బాస్ 11 సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రియాంక్ శర్మ, బెనాఫ్ షా సూనావాలా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నరని సమాచారం. తాజాగా వీళ్లిద్దరు తమ మధ్య ఉన్న బంధాన్ని సామాజిక మాధ్యమాల్లో కన్ఫామ్ చేస్తూ హర్ట్ ఎమోజీని షేర్ చేశారు. మా ప్రేమను అందరి ప్రేమలా కాదు. మాది గొప్ప ప్రేమ అంటూ సోసల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో బెనాఫ్ షా, నటుడు వరుణ్ సూద్‌తో డేటింగ్ చేసింది. బిగ్‌బాస్ షోకు వెళ్లొచ్చిన తర్వాత ప్రియాంక్ శర్మతో లవ్వాయణం నడుపుతోంది. దాదాపు రెండేళ్లుగా వారిన ప్రేమాయణంపై పుకార్లు నడుస్తుండగా ఫైనల్‌గా తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
First published: April 7, 2020, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading