Bigg Boss: బిగ్‌బాస్ ఓ పనికిమాలిన ప్రోగ్రామ్..క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

Bigg Boss | బిగ్‌బాస్ షోను ఓ పనికిమాలిన ప్రోగ్రామ్ అంటూ ఓ  హీరోయిన్  చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అదో పనికి మాలిన షిట్ షో అంటూ పేర్కొనడం ఇపుడు సంచలనం‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 27, 2020, 7:59 PM IST
Bigg Boss: బిగ్‌బాస్ ఓ పనికిమాలిన ప్రోగ్రామ్..క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
బిగ్ బాస్ లోగో (Photo : Twitter)
  • Share this:
Bigg Boss | బిగ్‌బాస్ షోను ఓ పనికిమాలిన ప్రోగ్రామ్ అంటూ ఓ  హీరోయిన్  చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అదో పనికి మాలిన షిట్ షో అంటూ పేర్కొనడం ఇపుడు సంచలనం‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎక్కడో హాలీవుడ్‌లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో ముందుగా మన దేశంలో హిందీ భాషలో మొదలైంది. అక్కడ ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయింది.  ఆ తర్వాత వివిధ ప్రాంతీయ భాషల్లో ‌బిగ్‌బాస్‌ ప్రోగ్రామ్స్ చేస్తే.. ఆయా భాషల్లో కూడా  మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో మాత్రం బిగ్‌బాస్ నాల్గో సీజన్ నడుస్తోంది. వరుసగా నాగార్జున రెండోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో తమిళంలో బిగ్‌బాస్ షో నాల్గో సీజన్ మొదలు కానుంది.  ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా లక్ష్మీ మేనన్ అనే ఓ హీరోయిన్‌గా బిగ్‌బాస్ షో పై ఫైర్ అయింది. తమిళ బిగ్‌బాస్‌లోకి లక్ష్మీ మేనన్ ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే వార్తలపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది.

లక్ష్మీ మేనన్ (Twitter/Photo)


బిగ్‌బాస్ ఓ దిక్కుమాలిన ప్రోగ్రామ్. పని పాటా లేని వాళ్లే  ఈ ప్రోగ్రామ్‌లోకి వెళతారంటూ కామెంట్స్ చేసింది. నేను మాత్రం ఇతరులు తిన్న ప్లేట్స్ కడగడం, టాయిలెట్స్ శుభ్రం చేసే పనులు  ఇప్పటి వరకు చేయలేదు. ఇక ముందు చేయను కూడా. షో పేరుతో కెమెరాల ముందు ఫైటింగ్ గట్రా లాంటి యాక్షన్ చేయడం తనకు చేతకాదు అంటూ వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఇలాంటి షిట్ షోలో నేను పాల్గొంటున్నాని వస్తోన్న వార్తలపై ఇప్పటికైనా మీకు క్లారిటీ వచ్చినట్టు ఉందని మీడియాపై రుసరుస లాడింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 27, 2020, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading