Bigg Boss 4 Telugu: కంటెస్టెంట్స్‌పై బిగ్ బాస్ సీరియస్.. గంగవ్వ తప్ప అందరితో గుంజీలు..

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఆటపాటలు.. ఏడపులు పెడబొబ్బులు ఉన్నాయి కానీ జైలుకు వెళ్లడాలు.. బిగ్ బాస్ పిలిచి పనిష్‌మెంట్స్ ఇవ్వడాలు జరగలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2020, 2:08 PM IST
Bigg Boss 4 Telugu: కంటెస్టెంట్స్‌పై బిగ్ బాస్ సీరియస్.. గంగవ్వ తప్ప అందరితో గుంజీలు..
బిగ్ బాస్ 4 తెలుగు (bigg boss 4 telugu)
  • Share this:
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఆటపాటలు.. ఏడపులు పెడబొబ్బులు ఉన్నాయి కానీ జైలుకు వెళ్లడాలు.. బిగ్ బాస్ పిలిచి పనిష్‌మెంట్స్ ఇవ్వడాలు జరగలేదు. సీజన్ మొదలై రెండు వారాలు కావొస్తున్నా కూడా ఇప్పటి వరకు అలాంటివి అయితే ఇంట్లో చూడలేదు. పైగా ఇంట్లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు సభ్యులు కూడా. ముఖ్యంగా తెలుగు టాక్ షోలో ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. అది తెలుగు బిగ్ బాసా లేదంటే ఇతర భాషల్లోంచి వచ్చిందా అని అనుమానాలు కూడా వస్తున్నాయి.
బిగ్ బాస్ 4 తెలుగు (bigg boss 4 telugu)
బిగ్ బాస్ 4 తెలుగు (bigg boss 4 telugu)


ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కూడా సీరియస్ అయ్యాడు. ఈ సీజన్‌లో తొలిసారి అందరికీ శిక్ష వేసాడు. గంగవ్వ మినహా అందరితోనూ గుంజీలు తీయించాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. తదుపరి ఆదేశం వచ్చేవరకు ఇలాంటి శిక్షలు అమలు అవుతూనే ఉంటాయని చెప్పాడు బిగ్ బాస్. దాంతో గంగవ్వ మాత్రమే పక్కన ఉంది. మిగిలిన 15 మంది ఇంటి సభ్యులు పూర్తిగా గుంజీలతో పాటు ఇతర శిక్షలు కూడా అనుభవిస్తున్నారు.

ఏ ఒక్కరు కూడా ఇంట్లో నియమాలు పాటించడం లేదని.. ఎవరికి నచ్చినట్లు వాళ్లుంటున్నారంటూ సీరియస్ అయ్యాడు బిగ్ బాస్. అందుకే పనిష్మెంట్ తప్పదని అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఇది బాగా వైరల్ అవుతుంది కూడా. బిగ్ బాస్‌ ఆదేశాలను పట్టించుకోని ఇంటి సభ్యులు అంటూ నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి చూడాలిక.. వాళ్లతో గుంజీలు మాత్రమే కాకుండా ఇంకా ఏమేం శిక్షలు వేసాడో బిగ్ బాస్.
Published by: Praveen Kumar Vadla
First published: September 18, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading