శ్రీముఖితో పిడకలు కొట్టించిన బిగ్ బాస్.. వైరల్ అవుతున్న విజువల్..

Bigg Boss 3 Telugu: అక్కడున్నది బిగ్ బాస్.. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. అడ్డూ అదుపు అనేది ఉండదు. మనకు నచ్చింది అక్కడ చేయడు.. బిగ్ బాస్ తన మనసుకు నచ్చింది మాత్రమే చేస్తూ వెళ్తుంటాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 12:44 PM IST
శ్రీముఖితో పిడకలు కొట్టించిన బిగ్ బాస్.. వైరల్ అవుతున్న విజువల్..
బిగ్ బాస్ 3 ప్రోమో షాట్ (Source: Star Maa)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 12:44 PM IST
అక్కడున్నది బిగ్ బాస్.. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. అడ్డూ అదుపు అనేది ఉండదు. మనకు నచ్చింది అక్కడ చేయడు.. బిగ్ బాస్ తన మనసుకు నచ్చింది మాత్రమే చేస్తూ వెళ్తుంటాడు. ఊహకు కూడా అందని ట్విస్టులతో సాగిపోతుంది బిగ్ బాస్ సీజన్ 3. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మరో ఆసక్తికరమైన విజువల్ వచ్చింది. ఈ సారి శ్రీముఖిని టార్గెట్ చేసాడు బిగ్ బాస్. ఆమెతో పాటు అలీ రెజా కూడా బుక్ అయ్యాడు. ఈ ఇద్దర్నీ ఏకంగా 100 పిడకలు కొట్టాలంటూ ఆదేశించాడు. దీనికి ముందు సైక్లింగ్ కూడా పెట్టాడు బిగ్ బాస్.

ఒకటి కరెంట్ కోసం.. మరోటి గ్యాస్.. ఇంకోటి నీటి కోసం ఈ సైక్లింగ్ పోటీ పెట్టాడు బిగ్ బాస్. అక్కడ తొక్కితేనే ఇక్కడ ఇవన్నీ వస్తాయి లేదంటే లేదు. అది నడుస్తుండగానే ఇప్పుడు మరో టాస్క్ ఇచ్చాడు శ్రీముఖికి. ఈమె 100 పిడకలు కొట్టాలని చెప్పేసరికి షాక్ అయిపోయింది. అయినా తప్పదు కదా.. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు ఇవన్నీ కామన్. పైగా నామినేషన్స్‌లో కూడా టాప్‌లో ఉంది శ్రీముఖి. ఆమెను వీలైనంత త్వరగా పంపేయాలని డిసైడ్ అయిపోయారు ఇంటి సభ్యులు. ఆమెకు తెలియకుండానే శ్రీముఖిపై చాలా కుట్రలు చేస్తున్నారు అక్కడ. మరి చూడాలిక.. ఈ పిడకల యవ్వారం ఏందో..?

First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...