బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ సన్నీ(Sunny) వరుసగా సినిమాలపై దృష్టి పెట్టారు. సన్నీ హీరోగా మరో కొత్త సినిమా తెరకెక్కనుంది. డైమండ్ రత్నబాబు(Daimond Ratnababu) ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నీతో సినిమా చేస్తుండడం ఇప్పుడు టాలీవుడ్‌లో (Tollywood) హాట్ టాపిక్‌గా మారింది. విశేషం. ఓ ఛానల్‌లో రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు సన్నీ. వీజేగా మారి.. సీనియల్స్‌లో యాక్టర్‌గా రాణించి.. ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్-5(Bigg Boss Season 5) విన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్‌గా నిలిచిన సన్నీ.. రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ సంస్థ నుంచి 300 గజాల భూమిని కూడా అందుకున్నాడు.
తాజాగా హీరోగా రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్‌లో కొత్త మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి. సన్నీతో పాటు నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హౌస్ నుంచి బయటికి వచ్చాక సినిమాలు చేస్తున్నాడు సన్నీ. 'సకల గుణాభిరామ' సినిమాలో హీరోగా నటించిన సన్నీ.. డైలాగ్ రైటర్, 'సన్నాఫ్ ఇండియా' (Son of India) మూవీ డైరెక్టర్ డైమాండ్ రత్నబాబుతో న్యూ మూవీ ప్రకటించాడు. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలి ఆడియన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం.
Big boss fame #Sunny team up with director #DaimondRatnababu.
Movie launch very soon. Title and first look reveals in launch event. @SreedharSri4u pic.twitter.com/4PM5b3limb
— BA Raju's Team (@baraju_SuperHit) May 27, 2022
ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సబంధించి టైటిల్, ఫస్ట్‌లుక్, నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. బిగ్‌బాస్ ట్రోఫీని గెలవడంతో సన్నీకి యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. సన్నీ హీరోగా నటించిన 'సకల గుణాభిరామ' మూవీ ట్రైలర్ కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg boss telugu, Son Of India, Sunny