అందుకే శ్రీముఖి సినిమాలకు గుడ్ బై చెప్పిందట..

పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి... ఆ తర్వాత తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. తాజాగా శ్రీముఖి తాను ఎందుకు సినిమాలు చేయడం లేదనే విషయమై క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: April 9, 2020, 1:59 PM IST
అందుకే శ్రీముఖి సినిమాలకు గుడ్ బై చెప్పిందట..
యాంకర్ శ్రీముఖి (Photo: Sreemukhi/Instagram)
  • Share this:
పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి... ఆ తర్వాత తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో మూడు నెలలకు పైగా తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి ఆ షో ముగిసిన తర్వాత కాస్త విరామం తీసుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ నిర్వహిస్తూ ఫుల్లు బిజీగా  ఉంటోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎపుడు టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈమె ఆలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొని రవితో తన రిలేషన్ షిప్‌తో పాటు తన చిన్ననాటి విషయాలు.. సినిమాల్లో నటించకపోవడానికి గత కారణాలను వెల్లడించింది. శ్రీముఖి ‘జులాయి’ చేస్తున్నపుడే ఇదే మొదటి, చివరి చిత్రమని నాన్న చెప్పారు. ఆ తర్వాత ఒకటో రెండో సినిమాలు చేసాను. ఆ తర్వాత పూర్తిగా మానేసానంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారు కూడా టీవీల్లో ఎక్కువ షోలు చేస్తే.. సినిమాల్లో ఛాన్సులు రావు. మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేయమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చింది. అయితే అదే సమయంలో నా దగ్గరకు వచ్చిన కథలేవి నన్ను సంతృప్తి పరచలేదు. ఎక్కువగా చిన్న చిన్న సినిమాలు వచ్చాయి. అందులో ఎక్స్‌పోజింగ్ చేయమని.,. ముద్దు సీన్లలో యాక్ట్ చేసే సినిమాలే తన దగ్గరకు ఎక్కువగా వచ్చాయంది. అందుకే సినిమాల్లో నటించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకొచ్చింది. .
First published: April 9, 2020, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading