శ్రీముఖి వాళ్ల చేతిలో అలా దారుణంగా మోసపోయిందట..

శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.

news18-telugu
Updated: May 16, 2020, 3:10 PM IST
శ్రీముఖి వాళ్ల చేతిలో అలా దారుణంగా మోసపోయిందట..
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)
  • Share this:
శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈటీవీ ప్లస్‌లో వచ్చే పటాస్‌ షోతో బాగా పాపులర్ అయింది ఈ భామ. అక్కడ వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచింది. కేవలం రియాలిటీ షోస్ మాత్రమే కాదు..  అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపించి తన లక్‌ను పరిక్షించుకుంది.  ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అందిరిలాగే ఇంటికే పరిమితమైంది ఈ భామ.  అంతేకాదు ఎప్పటి కపుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వారికి దగ్గర ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది శ్రీముఖి.  ఈ సందర్భంగా గోవాలో తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. తనకు కసీనో గేమ్ అంటే ఎంతో పిచ్చి. ఆ కారణంగా తాను కెసీనోలో ఆట ఆడి ఎన్నో డబ్బులు పోగుట్టుకున్నానని చెప్పింది. ఫస్ట్ టైమ్ గోవాకు వెళ్లినపుడు కెసీనోలో గేమ్ ఆడితే.. తనకు డబ్బులు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆశతో రెండో మూడు సార్లు అలా గోవా వెళ్లినపుడల్ల అక్కడ కెసీనోలో గేమ్ ఆడి డబ్బులు పోగుట్టుకున్నానని చెప్పుకొచ్చింది. చేతిలో ఉన్న డబ్బంతా పోవడంతో అప్పటి నుంచి గోవాకు వెళ్లినా.. ఆ గేమ్ మాత్రం ఆడటం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలె విడుదలైన ఈ సినిమాలో ఆమె లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 16, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading