బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టంట్ షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth) ఈయన పేరుకు కూడా ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. యూ ట్యూబ్ సెన్సేషనల్ స్టార్ ఈ కుర్రాడు. షణ్నుకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. షణ్ముఖ్ ఇంట్లో విషాదం నెలకొంది. షన్ను బామ్మ మరణించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు షన్ను తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టేశాడు. దీంతో షన్ను చేసిన పోస్ట్ చూసి నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. షన్ను చేసిన పోస్ట్ చూసి, అందులో తన బామ్మతో ఉన్న రిలేషన్ చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. మామూలుగానే షన్ను ఈ మధ్య డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.అసలే దీప్తి సునయన(Deepthi Sunaina) బ్రేకప్‌తో షన్ను తీవ్రంగా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.
బిగ్ బాస్ (Bigg Boss)నుంచి బయటకు వచ్చిన తర్వాత షన్నుకు దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షన్ను మాత్రం ఇంకా దీప్తి సునయని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు షన్ను వచ్చిన సమయంలోనూ దీప్తి సునయన టాపిక్ వచ్చినా తప్పించుకోకుండా సమాధానం చెప్పాడు. దీప్తి సునయనని త్వరలోనే కలుస్తాను అని అందరి ముందే ధైర్యంగా చెప్పేశాడు. అయితే షన్ను మాత్రం ఇంకా ఆ బాధలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన బామ్మ చనిపోవడంతో రిప్ అని పోస్టు పెట్టాడు. హృదయం బద్దలైనట్టుగా ఎమోజీని షేర్ చేశాడు.
తన పెళ్లి చూస్తావా? అని షన్ను అడిగితే. చూస్తానో లేదో.. అప్పటి వరకు ఉంటానో లేదో అని బామ్మ అన్నట్టుగా ఉంది. నీ పెళ్లి వరకు ఉంటుంది.. పెళ్లి చూస్తుందని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. కానీ షన్ను పెళ్లిని చూడకుండానే వెళ్లిపోయింది. మొత్తానికి షన్ను ఇంట్లో ఈ తీవ్ర విషాదం మాత్రం నేడు చోటు చేసుకుంది.షన్ను ప్రస్తుతం ఆహా యాప్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఏజెంట్ ఆనంద్ సాయి అంటూ రాబోతోన్నాడు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడులైంది. గత రెండు వారాల క్రితం షన్ను గోవాలో ఎంజాయ్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసమే అక్కడకు వెళ్లినట్టు తెలుస్తోంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.