రాహుల్ సిప్లిగంజ్ అభిమానులకు గుడ్ న్యూస్

ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో నటించబోతున్నాడు. యాక్టర్‌గా రాహుల్‌కు ఇదే తొలి సినిమా. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు రాహుల్.

news18-telugu
Updated: December 3, 2019, 2:35 PM IST
రాహుల్ సిప్లిగంజ్ అభిమానులకు గుడ్ న్యూస్
రాహుల్ సిప్లిగంజ్ Instagram/sipligunjrahul
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్.. తెలుగు సినీ అభిమానులకు ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ మొన్నటి వరకు జనాలకు పెద్దగా తెలియదు. బడా హీరోల సినిమాలతో పాటు ఎన్నో హిట్ పాటలు పాడినప్పటికీ .. ఆ సాంగ్స్ ఇతడే పాడాడన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ బిగ్ బాస్ షోతో మనోడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్ విన్నర్‌గా నిలవడంతో రాహుల్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. దాంతో రాహుల్‌కు పాటలతో పాటు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి.

రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. మొన్నటి వరకు పాటలు మాత్రమే పాడిన రాహుల్.. ఇకపై పాటల రూపంలో వినిపించడంతో పాటు తెరపైనా కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ క్రేజ్‌తో మనోడు సినిమా ఛాన్స్‌ని కొట్టేశాడు. ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో నటించబోతున్నాడు. యాక్టర్‌గా రాహుల్‌కు ఇదే తొలి సినిమా. బిగ్ బాస్‌‌లో 17 మంది పార్టిసిపేట్ చేసినప్పటికీ.. రాహుల్‌కే వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమాల్లో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పలు ప్రైవేట్ సాంగ్స్‌లో రాహుల్ కనిపించినప్పటికీ నటన విషయంలో మనోడికి ఎక్స్‌పీరియన్స్ లేదు. దాంతో రాహుల్‌కు కృష్ణవంశీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన కృష్ణవంశీ కొంతకాలంగా సక్సెస్‌కు దూరమయ్యాడు. 2017లో విడుదలైన నక్షత్రం సినిమా తర్వాత విరామం తీసుకున్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందంతో పాటు పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020లో మూవీని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: December 3, 2019, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading