Bigg Boss Nutan Naidu: చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు..

Bigg Boss Nutan Naidu: నూతన్ నాయుడు.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ చూసే ఆడియన్స్‌కు ఈయన బాగానే పరిచయం. రెండో సీజన్‌లో కామన్ మ్యాన్‌గా వచ్చి ఆ తర్వాత..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2020, 7:23 PM IST
Bigg Boss Nutan Naidu: చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు..
నూతన్ నాయుడు (Nutan Naidu)
  • Share this:
నూతన్ నాయుడు.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ చూసే ఆడియన్స్‌కు ఈయన బాగానే పరిచయం. రెండో సీజన్‌లో కామన్ మ్యాన్‌గా వచ్చి ఆ తర్వాత చాలా రచ్చ చేసాడు నూతన్ నాయుడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేసాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేసారు. చీటింగ్ కేసులో ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొన్ని రోజులుగా నూతన్ పూర్తిగా వివాదాల్లోనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ఓ దళిత యువకుడిగా శిరోముండనం చేసాడనే వార్తలతో కాంట్రవర్సీ అయిన నూతన్.. ఇప్పుడు ఉద్యోగాల పేరుతో మోసం చేసాడంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలోని ప్రముఖ ప్రభుత్వ రంగసంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నూతన్‌నాయుడు దంపతులు తనను మోసం చేశారని తూర్పుగోదావరి జిల్లా యువకుడు ఒకరు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన దగ్గర ఉద్యోగం పేరు చెప్పి 25 లక్షలు వసూలు చేసారని చెప్పాడు ఈయన. ఇప్పటికే ఈ కేసులో నూతన్ నాయుడు భార్య మధుప్రియను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇప్పుడు నూతన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
నూతన్ నాయుడు (Nutan Naidu)
నూతన్ నాయుడు (Nutan Naidu)

డబ్బులు తీసుకున్న తర్వాత రెండేళ్లుగా ఉద్యోగం కోసం అడుగుతున్నా నూతన్ దంపతులు పట్టించుకోలేదని తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసి ఆమెను వారం రోజుల కింద అరెస్ట్ చేసారు.. ఇప్పుడు నూతన్‌ను కూడా అరెస్ట్ చేసారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం దళిత యువకుడు శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్యను పోలీసులు అరెస్టు చేసి బెయిల్‌పై వదిలేసారు. కానీ బెయిల్ వచ్చిన కొన్ని గంటల్లోనే చీటింగ్ కేసులో మరోసారి అరెస్ట్ చేసారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌ సైతం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2020, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading