news18-telugu
Updated: January 2, 2021, 7:50 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన బిగ్బాస్ ఫేమ్ నోయల్ (Twitter/Photo)
Noel - Green India Challenge | రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా దేత్తడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు శంషాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటాడు ప్రముఖ నటుడు బిగ్బాస్ ఫేమ్ నోయెల్ సేన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు అనేవి మనకు చాలా చాలా అవసరం అని వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. కేవలం నాటడమే కాదు.. వాటిని సంరక్షించాలి కోరారు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా ముందుగా తీసుకుపోతున్న సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ 4 రియాల్టీ షో లో నాతో పాటు పాల్గొన్న సుజాత, కుమార్ సాయి, దీప్తి సునైనా, నాగవల్లి, రమ్య బెహ్రా, దివి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నోయల్ పిలుపునిచ్చారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 2, 2021, 6:40 PM IST