Home /News /movies /

BIGG BOSS FAME NANDINI RAI DANCE IN POSANI MURALI KRISHNA DEAD BODY REELS GOES VIRAL ON INTERNET NR

Nandini Rai: పోసాని శవం పక్కన డ్యాన్స్ వేసిన నటి.. వైరల్ అవుతున్న వీడియో?

Nandini rai

Nandini rai

Nandini Rai: తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది.

    Nandini Rai: తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది. వరుసగా ఆఫర్లు కూడా అందుకుంది. కానీ ఈ బ్యూటీ ఎందుకో అంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ బ్యూటీ బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అమాయకత్వ చూపులతో ప్రేక్షకుల హృదయాలను తాకింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

    పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది నందిని రాయ్. తొలిసారిగా హిందీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన నందిని ఆ తర్వాత 040 ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఇటీవలే విద్యాసాగర్ ముత్తు కుమార్ దర్శకత్వంలో విడుదలైన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ లో నటించగా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇందులోనటుడు ప్రియదర్శి కీలక పాత్రలో నటించాడు.

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నందిని రాయ్ ఈ సీరీస్ తర్వాత సిరీస్ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అందులో నటుడు పోసాని ఫోటోకి దండ వేసి ఉంది. శవం దగ్గర పూలు చల్లి ఉన్నాయి. ఇక్కడ సీన్ మొత్తం చూస్తే మొత్తానికి పోసాని చనిపోయినట్లు ఉండగా నందిని రాయ్ మాత్రం ఏడుపుతో కాకుండా నవ్వుతు తెగ రెచ్చిపోతూ డాన్స్ చేస్తూ కనిపించింది.








    View this post on Instagram






    A post shared by Nandini Rai (@nandini.rai)






    ఇక ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ లో పోసాని చనిపోయే సీన్ లో ఫన్నీ మూమెంట్ అంటూ వీడియో షేర్ చేస్తూ హీరో ధనుష్ ని ట్యాగ్ చేసింది. కారణం ధనుష్ నటించిన జగమే తందిరమ్ సినిమాలు ఇటువంటి సీన్ సమయంలో మాస్ బీట్ వేయగా అలాంటిది నందిని రాయ్ కూడా వేసి చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా ఫన్నీ వీడియో అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Bigg Boss, Nandini Rai, Posani murali krishna, The Name Of God Web Series

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు