Home /News /movies /

BIGG BOSS FAME MONAL GAJJAR FILES A CASE AGAINST ABIJEET FANS AND PR FOR TROLLING BADLY AND THREATEN HER SISTER PK

Monal Gajjar: అభిజీత్ ఫ్యాన్స్‌పై మోనాల్ గజ్జర్ పోలీస్ కంప్లైంట్.. చెల్లిని బెదిరిస్తున్నారని..

మోనాల్ అభిజీత్ (monal abijeet)

మోనాల్ అభిజీత్ (monal abijeet)

Monal Gajjar: బిగ్‌బాస్ 4వ సీజ‌న్‌లో అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అందరూ చెప్పేది ఒక్కరి పేరే.. అదే అభిజీత్. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ఇప్పుడు నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది.

బిగ్‌బాస్ 4వ సీజ‌న్‌లో అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అందరూ చెప్పేది ఒక్కరి పేరే.. అదే అభిజీత్. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ఇప్పుడు నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నపుడు తనకు కూడా తెలియలేదని.. కానీ బయటికి వచ్చిన తర్వాత అభి రేంజ్ చూస్తుంటే షాక్ అయిపోయానని చెప్పుకొచ్చింది మోనాల్ గజ్జర్. నాలుగో సీజన్ నర్మద నదిలా కన్నీటి వ‌ర‌ద పొంగించిన ఈమె 98 రోజుల లాంగ్ జర్నీ తర్వాత ఫినాలేకు ఒక్క వారం ముందు ఎలిమినేట్ అయిపోయింది. అయితే బయటికి వచ్చిన వెంటనే వరస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది మోనాల్. ఈ క్ర‌మంలోనే తన తోటి కంటెస్టెంట్ జోర్దార్ సుజాత‌కు కూడా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో చాలా విషయాల గురించి చెప్పుకొచ్చింది ఈమె. ముఖ్యంగా అభిజీత్ ఫ్యాన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై బయట జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించింది మోనాల్. అంతేకాదు ఇంట్లో తాను ఉన్నపుడు వేసుకున్న డ్రెస్సుల గురించి కూడా ఇక్కడ ట్రోల్ చేస్తున్నారని బాధ పడింది మోనాల్. ఓ వీకెండ్‌లో డీప్ నెక్ డ్రెస్ వేసుకుంటే దానిపై కూడా ట్రోలింగ్ చేసారని చెప్పుకుని బాధ పడింది ఈ భామ.
మోనాల్ గజ్జర్ చెల్లి హేమాలి (Monal Gajjar Abijeet)
మోనాల్ గజ్జర్ చెల్లి హేమాలి (Monal Gajjar Abijeet)

ఆ రోజు తన ఆరోగ్యం బాగోలేదని.. క‌నీసం కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదని.. అలాంటివి తెలుసుకోకుండా ట్రోలింగ్ చేసారని చెప్పింది మోనాల్. ఇక త‌న సోద‌రి హేమాలిని ట్రోల్ చేయ‌డాన్ని మోనాల్ సీరియస్‌గా తీసుకుంది. ఇదే విషయంలో అభిజీత్ పిఆర్ టీంతో పాటు ఫ్యాన్స్‌పై కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో కేసు ఫైల్ చేసింది. మోనాల్ చెల్లి హేమాలి హౌస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు వెనక నుంచి ఏం మాట్లాడొద్దు.. ఏదైనా ఉంటే ఆమె ముందు ధైర్యంగా మాట్లాడు అంటూ అభిజిత్‌కు ఓ స‌ల‌హా ఇచ్చింది. ఇదే ఆమెకు శాపంగా మారింది.
మోనాల్ గజ్జర్ చెల్లి హేమాలి (Monal Gajjar Abijeet)
మోనాల్ గజ్జర్ చెల్లి హేమాలి (Monal Gajjar Abijeet)

ఈ విషయంపైనే బయటికి వచ్చిన తర్వాత హేమాలిని చంపేస్తామని అభి ఫ్యాన్స్, పిఆర్ టీం బెదిరించారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన చెల్లి అన్న దాంట్లో నిజం ఉందని.. బయటికి వచ్చిన తర్వాత చూస్తే తన గురించి అభిజీత్ వెనక మాట్లాడాడనే విషయం స్పష్టమైపోతుందని చెప్పింది. అందుకే ఆమె అలా చెప్పిందని.. అందులో ఏ త‌ప్పూ లేదు.. పైగా తన చెల్లి స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటూ చెప్పింది మోనాల్. అయినా కూడా అభిజిత్ ఫ్యాన్స్ దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తూ సోద‌రిపై నీచంగా కామెంట్లు చేసారని.. చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది.

ఈ విషయంలో హేమాలి చాలా బాధ ప‌డిందని తెలిపింది మోనాల్. అందుకే ఈ విషయాన్ని సీరియ‌స్‌గా తీసుకుని తాను సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు చెప్పుకొచ్చింది మోనాల్ గజ్జర్. త‌న సోద‌రిని దారుణంగా ట్రోల్ చేసినందుకు అభిజిత్ ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఏదేమైనా కూడా ఫినాలేకు మరెంతో దూరం లేదు.. ఇలాంటి సమయంలో అభిజీత్ ఫ్యాన్స్‌పై మోనాల్ కేసు పెట్టడం ఆసక్తికరంగా మారింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Monal gajjar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు