HOME »NEWS »MOVIE »bigg boss fame monal gajjar controversial comments on lord sri rama and his behavior with seetha pk

Monal Gajjar: శ్రీ రాముడిపై మోనాల్ గజ్జర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. బిగ్ బాస్ బ్యూటీ కాంట్రవర్సీ..

Monal Gajjar: శ్రీ రాముడిపై మోనాల్ గజ్జర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. బిగ్ బాస్ బ్యూటీ కాంట్రవర్సీ..
శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్ గజ్జర్ (Monal Gajjar)

Monal Gajjar: బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా మోనాల్ గజ్జర్ ఏదో ఒకలా వార్తల్లోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా షో అయిపోయిన తర్వాత కూడా ఈమె తనను తాను హెడ్ లైన్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే బయటికి వచ్చిన..

  • Share this:
బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా మోనాల్ గజ్జర్ ఏదో ఒకలా వార్తల్లోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా షో అయిపోయిన తర్వాత కూడా ఈమె తనను తాను హెడ్ లైన్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే బయటికి వచ్చిన తర్వాత కూడా వరస ఇంటర్వ్యూలు ఇస్తుంది. దాంతో పాటు సినిమాలు కూడా చేస్తుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది మోనాల్ గజ్జర్. కేవలం 4 నిమిషాల ఐటం సాంగ్ కోసం ఏకంగా 15 లక్షలు పారితోషికం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు దేశమంతా దేవుడిగా పూజించే శ్రీ రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. దాంతో ఈమెపై భక్తుడు మండి పడుతున్నారు. ఏం తెలుసు నీకు.. శ్రీ రాముడి గురించి.. ఆయన గురించి నోరు పారేసుకునేంత గొప్ప దానికి అయిపోయావా అంటూ నిలదీస్తున్నారు. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో నుంచి వచ్చిన పాపులారిటీతో ఈమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల పుణ్యమే ఇప్పుడు మోనాల్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ షో నుంచి దాదాపు 50 లక్షలు అందుకుంది మోనాల్ గజ్జర్. దాంతో పాటు బయటికి వచ్చిన వెంటనే ఓంకార్ నిర్వహిస్తున్న డ్యాన్స్+ అనే షోలోనూ జడ్జ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలలో కొన్నిసార్లు తెలియకుండానే నోరు జారింది మోనాల్.

శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్ గజ్జర్ (Monal Gajjar)




అందులో భాగంగానే మీకు ఎలాంటి మొగుడు కావాలంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు మోనాల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. తనకు శ్రీక‌ృష్ణుడు లాంటి భర్త కావాలి అంటూ జవాబిచ్చింది. అదేంటి.. ఎవరైనా కూడా శ్రీ రాముడి లాంటి మొగుడు కావాలంటారు కానీ కృష్ణుడు ఏంటి అంటూ యాంకర్ అడిగేసరికి తనకు రాముడు నచ్చడు అంటూ సంచలన సమాధానం చెప్పింది. అంతేకాదు ఎవరో చెప్పిన మాట విని భార్యను అనుమానించాడు.. ఒకవేళ ఆయన తనకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్.

Monal Gajjar, Monal Gajjar Photos, Monal Gajjar hot Pics, Monal Gajjar Dancee Plus, మోనాల్ గజ్జర్, మోనాల్ గజ్జర్ ఫొటోలు
శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్ గజ్జర్ (Monal Gajjar)


ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలేం తెలుసు రాముడి గురించి.. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నావ్.. నువ్వు సారీ చెప్పకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయి అంటూ ఆమెకు వార్నింగ్స్ కూడా వెళ్తున్నాయి. రాముడు అలా చేసాడు కాబట్టే సీత పాతివ్రత్యం గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందంటూ రామ భక్తులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా తెలిసి చేసిందో లేదంటే సరదా కోసం మాట్లాడిందో తెలియదు కానీ రాముడిపై ఈమె చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:January 25, 2021, 20:35 IST