హోమ్ /వార్తలు /సినిమా /

Vishnu Priya: మానస్‌తో ఓ ఊపు ఊపేసిన విష్ణు ప్రియ.. వారెవ్వా! అదరిపోయే స్టెప్స్

Vishnu Priya: మానస్‌తో ఓ ఊపు ఊపేసిన విష్ణు ప్రియ.. వారెవ్వా! అదరిపోయే స్టెప్స్

Vishnu Priya (Photo Twitter)

Vishnu Priya (Photo Twitter)

Manas Vishnu Priya Song: జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి.. జారుతున్నావ్ రో చే జారుతున్నావ్ రో అంటూ అదిరిపోయే బీట్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు మానస్, విష్ణు ప్రియ. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో (Bigg Boss maanas) కలిసి ఓ ఊపు ఊపేసింది యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya). జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి.. జారుతున్నావ్ రో చే జారుతున్నావ్ రో అంటూ అదిరిపోయే బీట్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు. నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సాంగ్ విడుదల చేశారు. రిలీజ్ చేసిన కాసేపట్లో సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ గా మారింది. జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా మదిన్ సంగీత సారథ్యంలో వి.జె .శేఖర్ మాస్టర్ (Sekhar Master) నృత్య దర్శకత్వంలో ఈ ఫోక్ సాంగ్ రూపొందించారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘు కుంచె, సుద్దాల అశోక్ తేజ, వి జె శేఖర్ మాస్టర్, సాకేత్, రమణా చారి, ప్రసన్నకుమార్, పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బిగ్ బాస్ ఫేమ్స్ కాజల్, సన్నీ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాకేత్ (సింగర్) మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ."జరీ జరీ పంచె కట్టు" పాటను నేను పాడటం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ఆల్బమ్ సాంగ్స్ అన్నింటినీ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయడం కోసం ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన నిర్మాతలను నేను అభినందిస్తున్నాను అన్నారు.

హీరో మానస్ మాట్లాడుతూ..సుద్దాల అశోక్ తేజ్ గారితో లిరిక్స్ రాయించుకొని, శేఖర్ మాస్టర్ కు మాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోయినా శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లోనే ఈ పాట చెయ్యాలని పట్టు బట్టి చేసిన నివ్రితి వైబ్స్ వారికి థాంక్స్ చెప్పాలి. ఒక యు ట్యూబ్ సాంగ్ కు ఇంత ఖర్చు పెట్టి చేశారు చాలా గ్రాండ్ గా తీశారు.. ఈ పాటను చూసిన వారు చాలామంది ఇది మూవీ సాంగ్ అనుకునేలా చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనుకా డకుండా చాలా రిచ్ గా తెరకెక్కించారు . సుద్దాల అశోక్ తేజ్ గారు ఇచ్చిన లిరిక్స్అందరూ హమ్ చేసేలా చాలా ఈజీగా ఉన్నాయి.ఈ పాటకు సింగర్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ వర్క్ చేశారు. అలాగే చాలా టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయడం వలనే ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది.ఇంకా ఇలాంటి మంచి పాటలు ఎన్నో తీస్తూ నివృతి' వైబ్స్ కు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ్ రాసిన ఈ పాట చాలా బాగుంది.శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లో మానస్, విష్ణు ప్రియల "జరీ జరీ పంచెకట్టు" పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు.ఇంకముందు కూడా నివ్రితి వైబ్స్ వారు ఇలాంటి మంచి హిట్ పాటలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సన్నీ మాట్లాడుతూ.. మానస్ ను అందరూ హి విల్ బి స్టార్ అంటున్నారు.. బట్ నాకు తెలిసినంత వరకు మానస్ హి ఈజ్ ఎ స్టార్.. ఈ సాంగ్స్ లో తను చేసిన డాన్స్ అదిరిపోయింది.మానస్, విష్ణు ప్రియ ల డాన్స్ చాలా చూడముచ్చటగా ఉంది. వీరిద్దరూ డ్యాన్స్ చేసిన ఈ పాటకు ప్రేక్షకులనుండి మంచి క్రేజ్ వస్తుందని ఆశిస్తున్నా నివ్రితి వైబ్స్ ద్వారా వస్తున్న ఈ పాట బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

కాజల్ మాట్లాడుతూ.. మానస్, విష్ణు ప్రియలు చేసిన సాంగ్ ప్రోమో చాలా వైరల్ అయ్యింది. ఈ ఫుల్ సాంగ్ కొరకు వెయిట్ చేశాను. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాట ఇంకా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Anchor vishnu priya, Bigg Boss, Maanas

ఉత్తమ కథలు