Hema: ఆ డైరెక్టర్స్‌తో గొడవ కారణంగానే తనకు అలాంటి పాత్రలు వస్తున్నాయని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. రీసెంట్‌గా ఈమె యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నటించింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చేందని బయ్యర్స్ చెబుతున్నారు. దీంతో ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ సినిమాలో యాంకర్ ప్రదీప్ తల్లి పాత్రలో హేమ నటించింది. కొడుకును అతిగా ప్రేమించే తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కొడుకు ప్రేమించే తల్లికి అతని నుంచి ప్రేమను పొందలేకపోయే పాత్రలో హేమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈసందర్భంగా హేమ ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
నాకు నటిగా రెండు నంది అవార్డులు వచ్చినా.. ఎపుడూ నా కళ్ల వెంట నీళ్లు రాలేదు. నేను ఎప్పటి నుంచో ఇలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ విషయం పూరీ జగన్నాథ్ అన్నయ్యకు తెలుసు అన్నారు. నేను తల్లి పాత్ర కోసం పూరీతో ఎంతో గొడవ పడ్డాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇదే సమయంలో తన క్యారెక్టర్స్ విషయంలో సుకుమార్‌తో గొడవ పడితే.. ఆయన కుమారి 21F లో తనకు మంచి మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ పాత్ర తనకు ఎంతో పేరు తీసుకొచ్చిందన్నారు. ఆ తర్వాత ఎవరు తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని ఒకింత అసంతృప్తికి గురయినట్టు హేమ చెప్పుకొచ్చారు. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో తన పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే కళ్ల వెంట నీళ్లు ఆగడం లేదన్నారు. ఈ పాత్ర ఇచ్చిన దర్శకుడికి, హీరోకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పింది. ఇక ఈ సినిమాలో కథానాయికుడిగా నటించిన ప్రదీప్‌ని నేను ఎపుడు తమ్ముడు అంటూ పిలిస్తూ ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కడ కలిసిన ఎంతో చక్కగా మాట్లాడుకుంటాం. ఈ సినిమా విషయంలో అతను చేసిన సాయాన్ని మరవలేను. హేమను తల్లిగా అంటే జనాలు నవ్వుతారేమో కామెడీ అయిపోతుందేమో అన్న భయం లేకుండా.. తనకు ఈ పాత్ర దక్కేలా చేసిన ప్రదీప్‌తో పాటు సినిమా యూనిట్‌కు హేమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. హేమ విషయానికొస్తే.. ఈమె గతంలో బిగ్‌బాస్ 3లో ఒక కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా ఒక వారంలోపే హౌస్‌లోంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ఈమె బిగ్‌బాస్ హౌస్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.