Bigg Boss Hari Teja: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ హరితేజ..

actress Hari Teja (నటి హరితేజ)

Bigg Boss Hari Teja: 'ఇట్స్ బేబీ గర్ల్' అంటూ హరితేజ (Hari Teja) తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. దాంతో హరితేజకు నెటిజన్ల నుంచి అభినందనలు వస్తున్నాయి. బుల్లితెరపై సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈమె.

  • Share this:
టాలీవుడ్ నటి, యాంకర్‌ హరితేజ తల్లి అయింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో ఫోటోలు పోస్ట్ చేస్తుంది హరితేజ. ఇప్పుడు ఈమెకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని అధికారికంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సన్నిహితులతో, అభిమానులతో ఈ విషయం పంచుకుని సంతోషంలో మునిగిపోయింది హరితేజ. గతేడాది లాక్‌డౌన్ సమయంలో గర్భం దాల్చింది ఈమె. అప్పట్లో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది హరితేజ. ఆ తర్వాత రెగ్యులర్‌గా గర్భంతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చింది. కొన్ని రోజులుగా అలా పోస్ట్ చేయడం ఆపేసింది. ఎప్రిల్ 5న ఈమెకు అమ్మాయి పుట్టింది. 'ఇట్స్ బేబీ గర్ల్' అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. దాంతో హరితేజకు నెటిజన్ల నుంచి అభినందనలు వస్తున్నాయి. బుల్లితెరపై సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈమె. ఆ తర్వాత సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. అ..ఆ సినిమాలో పని మనిషిగా నటించిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నటిగానే కాకుండా యాంకర్‌గానూ ఈమె స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్‌ 1లోకి వెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షోలో హరితేజకు మంచి గుర్తింపు వచ్చింది. లౌడ్ స్పీకర్ అంటూ ఈమెకు ముద్దుపేరు కూడా పెట్టాడు.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది ఈమె. కానీ ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తుంది హరితేజ. 2015లో ఆమె దీపక్ అనే కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది హరితేజ. రెండేళ్లుగా ఈమె పెద్దగా కనిపించడం లేదు. గర్భం కారణంగా ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2022లో ఈమె మళ్లీ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published: