హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss Gangavva in Hospital: హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన బిగ్ బాస్ గంగవ్వ.. ఏమైందో తెలుసా..?

Bigg Boss Gangavva in Hospital: హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన బిగ్ బాస్ గంగవ్వ.. ఏమైందో తెలుసా..?

గంగవ్వ (Twitter: StarMaa)

గంగవ్వ (Twitter: StarMaa)

Bigg Boss Gangavva in Hospital: అవునా.. ఏమైంది అవ్వకు.. ఇప్పుడు బాగానే ఉంది కదా అని కంగారు పడుతున్నారా..? బిగ్ బాస్ సీజన్ 4లో అందరి దృష్టిని ముందు నుంచి కూడా ఆకర్షించిన కంటెస్టెంట్ గంగవ్వ. ఉన్నది నాలుగు వారాలే అయినా కూడా తనకంటూ..

అవునా.. ఏమైంది అవ్వకు.. ఇప్పుడు బాగానే ఉంది కదా అని కంగారు పడుతున్నారా..? బిగ్ బాస్ సీజన్ 4లో అందరి దృష్టిని ముందు నుంచి కూడా ఆకర్షించిన కంటెస్టెంట్ గంగవ్వ. ఉన్నది నాలుగు వారాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. పైగా అంతకంటే ముందుగానే మై విలేజ్ షోతో బాగా పాపులర్ అయింది గంగవ్వ. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు వచ్చి మరింత పాపులర్ అయింది ఈ అవ్వ. 60 ఏళ్ళ వయసులో అతి సామాన్యురాలిగా బిగ్ బాస్ గేమ్ షోకి వచ్చి చాలా మంది అభిమానులను సంపాదించుకుంది గంగవ్వ. అయితే ఈ వయసులో ఇలాంటి కంటెస్టెంట్‌ను ఎంపిక చేసి ఏం చేస్తారు.. అక్కడున్న వాతావరణానికి ఆమె అలవాటు పడుతుందా.. పైగా ఫిజికల్ టాస్కులు ఎలా చేస్తుంది అంటూ చాలా మంది విమర్శించారు కూడా. అయితే ఎన్ని చేసినా కూడా బిగ్ బాస్ తాను అనుకున్నది చేసాడు. గంగవ్వ కూడా ఓ మంచి కారణంతోనే హౌజ్‌కు వచ్చింది. తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా టైటిల్ గెలిచి వస్తానని చెప్పింది కానీ మధ్యలో అనారోగ్యం కారణంగా బయటికి వచ్చేసింది. అయితే ఉన్నన్ని రోజులు బాగానే అలరించింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్‌కు ఈమె వెళ్లడానికి కారణం సొంతింటి కల నెరవేర్చుకోడానికే. అయితే టైటిల్ గెలవకపోవడంతో అంత డబ్బు రాదు. కానీ తన బాధను అర్థం చేసుకున్న నాగార్జున, బిగ్ బాస్ టీం అంతా కలిసి ఇప్పుడు గంగవ్వకు ఇల్లు కట్టిస్తున్నారు. ఇప్పటికే సొంతూళ్లో స్థలం ఉండటంతో అక్కడే ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతుంది.

gangavva,gangavva house,bigg boss-4 telugu contestant gangavva house,gangavva new house,bigg boss gangavva new house,bigg boss gangavva house,gangavva in bigg boss 4,bigg boss 4 telugu gangavva,gangavva comedy,my village show gangavva,biggboss 4 gangavva new house,gangavva videos,gangavva house in lambadipally,బిగ్ బాస్ గంగవ్వ,బిగ్ బాస్ గంగవ్వ ఇల్లు,బిగ్ బాస్ గంగవ్వ న్యూ హౌజ్
బిగ్ బాస్ గంగవ్వ హౌజ్ (Bigg Boss Gangavva house)

ఈ మేరకు నాగార్జున నుంచి గంగవ్వకు 7 లక్షల చెక్ వచ్చింది. అలాగే బిగ్ బాస్ టీం నుంచి కూడా 10 లక్షలు వచ్చాయి. దాంతో పాటు అవ్వ దగ్గర ఉన్న డబ్బులతో కలిపి 20 లక్షలతో సొంతూళ్లో ఇల్లు కట్టుకుంటుంది గంగవ్వ. ఇప్పటికే ఇల్లు నిర్మాణం కూడా సగానికి పైగా పూర్తయింది. సొంతింటి కల నెరవేర్చుకుంటున్న ఈ తరుణంలో అవ్వ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. దానికి కారణం ఆమెకు చాలా రోజులుగా మోకాళ్ల నొప్పులు వేధిస్తుండటమే.

బిగ్ బాస్ గంగవ్వ (bigg boss gangavva)
బిగ్ బాస్ గంగవ్వ (bigg boss gangavva)

వయసు రీత్యా వచ్చే నొప్పులే ఇవి. 60 ఏళ్లు దాటిన అవ్వకు మోకాళ్ల నొప్పులు తీవ్రం కావడంతో హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకుంది. ఈమె కాళ్లను వైద్యులు పరీక్షిస్తున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాళ్ల నొప్పులు మినహాయిస్తే తనకు ఏ అనారోగ్యం లేదని అభిమానులకు చెప్తుంది గంగవ్వ. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన సొంత యూ ట్యూబ్ ఛానెల్‌లో వరస వీడియోలు పెడుతుంది గంగవ్వ.

First published:

Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు