• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS FAME DEEPTHI SUNAINA CONFIRMS HER LOVE WITH YOUTUBE SENSATION SHANMUKH JASWANTH PK

Shanmukh Jaswanth - Deepthi Sunaina: బాయ్‌ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్‌తో మళ్లీ కలిసిపోయిన దీప్తి సునయన..

Shanmukh Jaswanth - Deepthi Sunaina: బాయ్‌ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్‌తో మళ్లీ కలిసిపోయిన దీప్తి సునయన..

దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ (deepthi sunaina shanmukh jaswanth)

Shanmukh Jaswanth - Deepthi Sunaina: దీప్తి సునయన.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు కేవలం సోషల్ మీడియా స్టార్‌గా ఉన్న ఈ బ్యూటీని బిగ్ బాస్ 2 సెలబ్రిటీగా మార్చేసింది. అప్పటి వరకు యూ ట్యూబ్‌లో కవర్ సాంగ్స్..

  • Share this:
దీప్తి సునయన.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు కేవలం సోషల్ మీడియా స్టార్‌గా ఉన్న ఈ బ్యూటీని బిగ్ బాస్ 2 సెలబ్రిటీగా మార్చేసింది. అప్పటి వరకు యూ ట్యూబ్‌లో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్న దీప్తి.. బిగ్ బాస్ తర్వాత స్టార్ అయిపోయింది. అందులో తనీష్‌తో అమ్మడు నడిపిన ప్రేమాయణం కూడా బాగానే పాపులర్ అయింది. అయితే బయటికి వచ్చిన తర్వాత దీప్తి, తనీష్ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అప్పటికే దీప్తి సునయనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతడి పేరు షణ్ముఖ్ జస్వంత్. ఈయన పేరుకు కూడా ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. యూ ట్యూబ్ సెన్సేషనల్ స్టార్ ఈ కుర్రాడు. షణ్నుకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈయన చేసే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌కు అదిరిపోయే వ్యూస్ వస్తాయి. మిలియన్స్ కొద్దీ ఫాలోయర్స్ సంపాదించుకుని సోషల్ మీడియాను ఏలేస్తున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఈయనతో కొన్నేళ్లుగా దీప్తి ప్రేమలో ఉంది. ఇదే విషయం ఓపెన్‌గానే చెప్పాడు షణ్ను. బిగ్ బాస్ సమయంలో హోస్ట్ నాని కూడా దీప్తి సునయనపై కామెడీ చేసేవాడు. అయితే ఆ సీజన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొన్ని గొడవలు జరిగి.. మనస్పర్థలు వచ్చి దీప్తి, షణ్ముఖ్ విడిపోయారు. మధ్యలో కొన్నిసార్లు ఫ్యాన్స్, ఫాలోయర్స్ అడిగినా కూడా సమాధానాలు దాటవేసారు ఈ ఇద్దరు.

దీప్తి కోసం పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు షణ్ను. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి కనిపించారు ఈ జోడీ. తాజాగా 100 పర్సెంట్ లవ్ అంటూ స్టార్ మాలో కొత్త ప్రోగ్రామ్ మొదలైంది. అందుకే షణ్ముఖ్ జస్వంత్, దీప్తి వచ్చారు. వచ్చి తమ ప్రేమను ఓపెన్‌గా అందరి ముందు ఒప్పుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పేసారు. యాంకర్ రవి, వర్షిణి హోస్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో దీప్తి, షణ్ముఖ్ జంట కూడా బాగానే వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: