వైసీపీ ఎమ్మెల్యే రోజాకు బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ సవాల్

బిగ్ బాస్ ఫేమ్ , నటి భానుశ్రీ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సవాల్ చేశారు.

news18-telugu
Updated: November 26, 2019, 2:42 PM IST
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ సవాల్
రోజా, భానుశ్రీ
  • Share this:
బిగ్ బాస్ ఫేమ్ , నటి భానుశ్రీ  వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సవాల్ చేశారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు బిగ్ బాస్ 2 షో ఫేమ్ భాను శ్రీ.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్ సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన భాను శ్రీ ఇవాళ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భాను శ్రీ  మాట్లాడుతూ మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు.

మొక్కలు నాటిన భానుశ్రీ


రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో ఐదుగురికి ఆమె గ్రీన్ ఛాలెంజ్ చేశారుజ సినిమా హీరోయిన్ MLA రోజా , ఆర్టిస్టు ప్రియా , జబర్దస్త్ చమక్ చంద్ర , జబర్దస్త్ గెటప్ శీను , జబర్దస్త్ అవినాష్ లకు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన భానుశ్రీ
Published by: Sulthana Begum Shaik
First published: November 26, 2019, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading