Bigg Boss Fame Hema: నటి హేమకు అంత పెద్ద కూతురుందా.. తాజాగా ఈమె ఆలీ తో సరదాగా కార్యక్రమంలో ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మీతో కలసి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా నటి హేమ తన సినీ జీవితంతో పాటు పర్సనల్ విషయాలను పంచుకున్నారు. నటి హేమ విషయానికొస్తే.. ఈమె సినిమాల్లో రావడానికి ముందుగా ఓ డాన్స్ డైరెక్టర్ దగ్గర డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. హీరోయిన్ అవుదామనుకున్న ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిగా స్థిర పడ్డారు. తెలుగులో ఈమె నటించిన మొదటి చిత్రం ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ,విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ‘భలే దొంగ’. ఈ చిత్రంలో హేమ... రావు గోపాల రావు కూతురు పాత్రలో నటించింది. రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. భలే దొంగ సినిమాతో మొదలైన హేమ నట ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈమె తెలుగులో 475 సినిమాల వరకు నటించినట్టు చెప్పుకొచ్చారు.
ఈ షోలో హేమ తన భర్త సయ్యద్ జాన్ అహ్మద్ ఎంతో అమాయకుడిని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన కూతురును కూడా పరిచయం ఈ షో ద్వారా ప్రేక్షకులను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈమె BBA చదవుతోంది. ఎంతో క్యూట్‌గా ఉన్న హేమా అమ్మాయి.. ఈ షోలో ఆలీతో పాటు తల్లి హేమను శ్రీలక్ష్మిని పలకరించింది. ఈమెను చూసి ప్రేక్షకులకు షాక్ అయినంత పనైయింది. హేమకు ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్యర్య పోతున్నారు. అంతేకాదు ఈమెలో ో హీరోయిన్ కు కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలో ఈమె హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసినా... ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.
హేమా విషయానికొస్తే.. ఏడవ తరగతి వరకు చదువుకున్న హేమ ఆ మధ్య డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు రాసింది. ఈ మధ్య ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నటించింది. ఈ సినిమాలో ప్రదీప్ అమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.