బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత అంతా ఇదే ఫీల్ అవుతున్నారు. దివాళీ రోజు ఇంకెవరూ దొరకనట్లు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులనే ఫూల్స్ చేయాలని చూసారు. కానీ 11 వారాలుగా బిగ్ బాస్ చేసే పనులు వాళ్లకు తెలియదా..? ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఊహించలేరా..? ఎంత డ్రామా ఆడినా కూడా ఆడియన్స్ వాళ్ల కంటే తెలివైన వాళ్లు. అందుకే వెంటనే గెస్ చేస్తుంటారు. గత వారం సుమ కనకాల ప్రోమో విడుదల చేసి వైల్డ్ కార్డ్ చెప్పినా కూడా ఒక్కరు కూడా నమ్మలేదు. కానీ నమ్మించాలని చూసాడు బిగ్ బాస్. ఇక ఈ వారం కూడా అదే డ్రామా రిపీట్ చేసాడు. అప్పుడు ఒకర్ని లోపలికి పంపిస్తామని చెప్పాడు. ఇప్పుడేమో ఇంట్లో ఉన్న ఓ స్ట్రాంగ్ ప్లేయర్‌ను బయటికి పంపిస్తానని చెప్పి డ్రామాలు ఆడాడు. కానీ అది డ్రామా అని అప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఈ సీన్ అంతా అఖిల్ విషయంలోనే జరిగింది. ఈయన్ని గత మూడు నాలుగు రోజులుగా సీక్రేట్ రూమ్‌లో ఉంచారు.

అఖిల్ ఫేక్ ఎలిమినేషన్ (akhil bigg boss nagarjuna)
అక్కడ్నుంచే అందరి కథలు కూడా చూసాడు.. మాటలు విన్నాడు అఖిల్. అయితే అక్కడ్నుంచే ఈయన్ని నేరుగా ఎలిమినేట్ అయిపోయాడని ప్రోమో విడుదల చేసారు. కానీ అది చూసిన తర్వాత ఎవరూ పెద్దగా నమ్మలేదు. ప్రోమో కింద వచ్చే కామెంట్స్‌లో కూడా బిగ్ బాస్ మరోసారి ఫూల్ చేయడానికి చూస్తున్నాడంటూ చెప్పేసారు. అఖిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్‌ను కేవలం ఇంటి సభ్యులు చెప్పారనే కారణంతో బయటికి పంపడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. పైగా నామినేషన్స్‌లో కూడా లేడు.. అన్నింటికి మించి ప్రేక్షకులే బయటికి పంపిస్తారని చెప్పి ఇంటి సభ్యుల చేతిలో ఎలిమినేషన్ పెడితే అంతకంటే పెద్ద తప్పు మరోటి ఉండదు.

అఖిల్ ఫేక్ ఎలిమినేషన్ (akhil bigg boss nagarjuna)
అక్కడే దొరికిపోయాడు బిగ్ బాస్.. దాంతో ప్రోమోలు రిలీజ్ చేసినా.. ఎలిమినేట్ అయ్యాడని చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అదంతా ఓ డ్రామా అని కొట్టి పారేసారు. చివరికి వాళ్ల నమ్మకమే నిజమైంది. అఖిల్ సీక్రేట్ రూమ్ నుంచి నేరుగా హౌజ్‌లోకి వెళ్లాడు. దాంతో పాటే నెక్ట్స్ వీక్ కెప్టెన్ కూడా అయ్యాడు. అంటే వచ్చే వారం కూడా అఖిల్ సేఫ్ అన్నమాట. మొత్తానికి మూడు రోజులు సీక్రేట్ రూమ్‌లో ఉన్నందుకు ఓ వారం ఎలాంటి టాస్కులు లేకుండా కెప్టెన్ అయ్యాడు అఖిల్. కానీ పాపం బిగ్ బాసే మరోసారి బయటపడ్డాడు. ఇలాగే చేస్తూ పోతే ఈ సారి నిజంగానే ఎలిమినేట్ చేసినా కూడా అదేదో డ్రామా అనుకుంటారు.
Published by:Praveen Kumar Vadla
First published:November 14, 2020, 22:56 IST