సింగర్‌గా పాపులర్ అయి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో (Bigg Boss 6) టైటిల్ ఫేవరేట్ గా దూసుకుపోతున్నారు రేవంత్ (Singer Revanth). ‘బిగ్ బాస్’ సీజన్- 6 టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో ఆయన ఇంటి నుంచి ఓ గుడ్ న్యూస్ రావడం అభిమానుల్లో అవధుల్లేని ఆనందాన్ని నింపింది. సింగర్ రేవంత్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్విత (Revanth Wife Anvitha) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డిసెంబర్ 1 (గురువారం రోజు) రేవంత్ ఇంట ఆడబిడ్డ కాలుపెట్టింది. దీంతో రేవంత్ ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేప్పుడు రేవంత్ భార్య అన్విత ప్రెగ్నెంట్‌గా ఉన్నారనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోనే రేవంత్ భార్య సీమంతం వేడుక కూడా చూసాం. అన్విత సీమంతం వేడుక జరిగిందని.. ఆ మధుర క్షణాలను బిగ్ బాస్ మీకు చూపించాలని అనుకుంటున్నట్లు చెబుతూ సీమంతం వీడియోను టీవీలో చూపించాడు బిగ్ బాస్. ఈ వీడియో చూసి రేవంత్ ఎమోషనల్ అయ్యారు. అందరిముందే టీవీలో కనిపిస్తున్న భార్యకు ముద్దు పెట్టారు.
అన్విత ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో రేవంత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. చిన్నారికి గ్రాండ్ వెల్ కమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తనకు చిన్పప్పటి నుంచి తండ్రి లేని లోటు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకుంటానా అని ఎదురు చూస్తున్నా అంటూ బిగ్ బాస్ హౌస్ లో చెప్పి ఎమోషనల్ అయ్యారు రేవంత్. రానున్న ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ కి ఈ గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలుస్తోంది.
View this post on Instagram
తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు పాడి ఫేమస్ అయ్యారు రేవంత్. ‘బాహుబలి’ లో ‘మనోహరి..’ లాంటి పాటలు ఆయనను మరింత పాపులర్ చేశాయి. దాదాపు 200 లకు పైగా పాటలు పాడి అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు సింగర్ రేవంత్. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ రేవంత్‌కే ఉందనే ప్రచారాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss, Bigg Boss 6 Telugu, Tollywood