Home /News /movies /

BIGG BOSS CONTESTANT SOHEL STARTS HIS OWN NEW YOUTUBE CHANNEL NR

Bigg Boss Sohel: సోహెల్ ఏది వదలట్లేదుగా.. అది కూడా ప్రారంభించేశాడు!

bigg boss sohel

bigg boss sohel

Bigg Boss Sohel: బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారందరూ ప్రస్తుతం అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

    Bigg Boss Sohel: బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారందరూ ప్రస్తుతం అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా పాల్గొన్న సోహైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హౌస్ లో యాక్టివ్ గా ఉంటూ సందడి చేసే సోహెల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. పేరుకు సీజన్ ఫోర్ విజేత అభిజిత్ అయిన సోహైల్ విజేతల ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

    హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహైల్ ఏదో విధంగా సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లతో కలిసి ఎంతో సందడి చేశారు. అదేవిధంగా సోహైల్ హౌస్ నుంచి బయటకు రాగానే ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా సెట్ లో ఒక ఫ్రాంక్ వీడియో చేసి అందరినీ ఎంతో షాక్ కి గురి చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.




    ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్న సోహెల్ తాజాగా యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువలో ఉన్న సోహెల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను మరింత సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే మనం యూట్యూబ్ ద్వారా కలుద్దాం... మీ సలహా సూచనల మేరకు మీతో కలిసి ఉండటం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకొని అంటూ... ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అంటూ సోహెల్ చెప్పుకొచ్చారు.దీన్ని బట్టి చూస్తే సోహెల్ తనకున్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా తన అభిమానులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Bigg Boss Sohel, Tollywood actor, Youtube channel

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు