హోమ్ /వార్తలు /సినిమా /

Babu Gogineni: ''బిగ్ బాస్‌'' గాడు ఆ పని చేశాడు.. తేజస్వీ అలా అనేసిందంటూ బాబు గోగినేని రచ్చ!

Babu Gogineni: ''బిగ్ బాస్‌'' గాడు ఆ పని చేశాడు.. తేజస్వీ అలా అనేసిందంటూ బాబు గోగినేని రచ్చ!

Babu Gogineni

Babu Gogineni

Babu Gogineni: తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా పాల్గొన్న బాబు గోగినేని గురించి బిగ్ బాస్ హౌస్ లోనే చూశాం. ఆయన మాటల విధానం, ఉండే విధానం తో పాటు ఆయన ఎంత వ్యతిరేకతను అందుకున్నాడో కూడా చూసాం. బయట కూడా ఈయన ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.

ఇంకా చదవండి ...

Babu Gogineni: తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా పాల్గొన్న బాబు గోగినేని గురించి బిగ్ బాస్ హౌస్ లోనే చూశాం. ఆయన మాటల విధానం, ఉండే విధానం తో పాటు ఆయన ఎంత వ్యతిరేకతను అందుకున్నాడో కూడా చూసాం. బయట కూడా ఈయన ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇటీవలే సినీ నటి మాధవి లత కూడా ఈయనపై తెగ మండిపడింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

తన సోషల్ మీడియా వేదిక ద్వారా బిగ్ బాస్ గురించి సైన్స్ అంటూ.. జీవ ఆవిర్భావం గురించి బాబు గోగినేని ఈ విధంగా పోస్ట్ చేస్తూ.. చిన్న పిల్లల ఆటలను పెద్ద వాళ్లతో ఆడిస్తే తప్పకుండా అల్లరి చేస్తాను అంటూ.. చేసిన అల్లరి అల్లరే, తొండి తొండే కానీ బిగ్ బాస్ హౌస్ లో చాలా చేశాను అంటూ కొన్ని విషయాలను బయట పెట్టాడు బాబు గోగినేని. ఇక తను చేసిన అల్లరి గురించి టీవీ చూసేవారికి అర్థమయ్యే ఉంటుందని, అర్థం కాని వాళ్లు అక్కడికి ఎందుకు వెళ్లావు అని అడిగారట.

ఇక ఆయన బీబీసి తెలుగు వెబ్ సైట్స్ లో మూడు వ్యాసాలు రాశానని.. వెళ్లి అవి చదువుకోండి అని వాళ్ళతో చెప్పాడట. ఇక తను చేయించుకొని వెళ్లిన ప్రతి ఒక టీ షర్ట్ ఒక సైన్స్, మానవవాదం, రాజకీయం పాఠంతో కనెక్ట్ అయి ఉండేదట. ఇక ఆయన ఎమ్.ఎన్.రాయ్ గురించి, హ్యూమనిజం గురించి, మానవ హక్కుల గురించి వారి సంబంధాల గురించి కొన్ని అనుభవాలు చర్చించుకున్నారట.

ఇక ఆయన బిగ్ బాస్ లోకి సిలబస్ తో తప్ప మేకప్ వేసుకొని గంతులు వేయడానికి వెళ్లలేదు అంటూ కామెంట్ చేశాడు. కానీ అవి కూడా చేశాను అంటూ.. దొంగ ఓట్ల దొంగల్ని పట్టుకున్నాను అని తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను ఎలా మ్యానిప్యులేట్ చేయవచ్చునని పరిశీలించమని హెచ్చరించారట. ఇక సైన్స్ పాఠం చెప్పినందుకు అవి వింటూ కంటెస్టెంట్ లు కొన్ని తప్పులు చేయలేదని వాటికి శిక్షగా బిగ్ బాస్ 'గాడు' ఫుడ్ ఐటమ్స్ కొన్ని కట్ చేశాడని మండిపడ్డాడు.

ఇక తేజస్వి తనను తనలాంటి తండ్రి ఉంటే ఎక్కడనో ఉండేదని అంటూ అనడంతో తనకు ఆ సమయంలో తన అరుణ్ గుర్తుకొచ్చాడని, దొంగ రాస్కెల్ గాడు, ఇప్పుడు నాకంటే పొడుగు అయ్యాడు, మ్యూజిక్ మ్యూజిక్ అంటూ ఇంట్లో మ్యూజిక్ సెట్ మొత్తం కొన్నిపిచ్చుకున్నాడు అని తెలిపాడు. ఇక తనకు కూడా సైన్స్ మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నించినప్పుడు మ్యూజిక్ అంటూ ఉండేవాడని తెలిపాడు. ఇక ఓ వీడియోస్ షేర్ చేస్తూ ఈ వీడియోను తను ఇంత ముందుకు సరిగా చూడలేదని అందులో అరుణ్ అయిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తను స్పీచ్ ఇచ్చిన విజువల్స్ ను బిగ్ బాస్ వాళ్లు వేశారని ఇప్పటికీ బిగ్ బాస్ 'గాడు' అన్నది ఉపసంహరించుకుంటానని కొన్ని వ్యాఖ్యలు చేశాడు బాబు గోగినేని.

First published:

Tags: Babu Gogineni, Bigg boss season 2, Star dust, Tejaswi madivada

ఉత్తమ కథలు