Home /News /movies /

BIGG BOSS CONTESTANT ASHU REDDY SHOCKING COMMENTS ON ANCHOR RAVI ON HAPPY DAYS SHOW NR

Anchor Ravi - Ashu Reddy: ఆ లేడీ యాంకర్లతో ఏం చేశాడంటూ.. యాంకర్ రవిపై అషు రెడ్డి షాకింగ్ కామెంట్స్!

ashu reddy anchor ravi

ashu reddy anchor ravi

Anchor Ravi - Ashu Reddy: బుల్లితెర పై మేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ

    Anchor Ravi - Ashu Reddy: బుల్లితెర పై మేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలు అందుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు రవి. ప్రస్తుతం ఈయన పలు షో లలో బిజీగా ఉండగా తాజాగా మరో షో లో ఆర్టిస్ట్ అషు రెడ్డితో కలిసి యాంకరింగ్ చేస్తున్నాడు.

    డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత గా గుర్తింపు పొంది వెండితెరపై అవకాశాలు అందుకున్న సెలబ్రిటీ అషు రెడ్డి. బిగ్ బాస్ లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. పైగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెంచుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చ చేస్తుంది. పైగా పవన్ అభిమానిగా మరింత ఫాలోయింగ్ అందుకుంది. అంతేకాకుండా లవ్ ఎఫైర్ తో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలే యాంకర్ గా కూడా అడుగుపెట్టింది. తాజాగా యాంకర్ రవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.

    ప్రస్తుతం యాంకర్ రవి, అషు రెడ్డి లు కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్నారు. ఇందులో ఎక్స్ ప్రెస్ హరి, జబర్దస్త్ అజయ్ కూడా చేస్తున్నారు. ఇక ఇందులో స్టూడెంట్స్ తో కలిసి బాగా రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో ఓ స్టూడెంట్ యాంకర్ రవిని.. మీరు చాలా మంది లేడీ యాంకర్ లతో చేశారు కదా అని ఏదో అడుగుతున్నా సమయంలో వెంటనే అషు రెడ్డి.. లేడీ యాంకర్ల తో ఏం చేశాడు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా ప్రశ్నించింది. దీంతో రవి షాక్ అవ్వగా అక్కడున్న స్టూడెంట్ వేరే అర్థం తో తెగ నవ్వుకున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anchor ravi, Ashu reddy, Bigg Boss 3, Etv plus, Happy days show

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు