వామ్మో.. యాంకర్‌ రవిపై అలీ రెజా బూతు పురాణం..

అలీ రెజా తన జిగ్రీ దోస్త్ కావడంతో.. ఎన్ని బండ బూతులు తిట్టినా రవి లైట్ తీసుకున్నట్టుగానే ఉన్నాడు. పైగా షో ప్రమోషన్ కోసమే కావాలనే ఇలా ప్లాన్ చేశారేమోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

news18-telugu
Updated: November 20, 2019, 8:40 AM IST
వామ్మో.. యాంకర్‌ రవిపై అలీ రెజా బూతు పురాణం..
యాంకర్ రవి,అలీ రెజా
  • Share this:
బుల్లితెర రియాలిటీ షోల్లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి.. ఇటీవలే సొంతగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వరుణ్-వితికా,రాహుల్,పునర్నవిలను ఇంటర్వ్యూ చేసిన రవి.. రెండో ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అలీ రెజా,అతని సతీమణి,మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్
శివజ్యోతిలను ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మంగళవారం ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో అలీ రెజా రవిని బండ బూతులు తిట్టడం గమనార్హం.

అలీ రెజా తన జిగ్రీ దోస్త్ కావడంతో.. ఎన్ని బండ బూతులు తిట్టినా రవి లైట్ తీసుకున్నట్టుగానే ఉన్నాడు. పైగా షో ప్రమోషన్ కోసమే కావాలనే ఇలా ప్లాన్ చేశారేమోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో పాల్గొనే ముందు శివజ్యోతి తన భర్తతో చేసిన కామెంట్స్ సరదాగా సాగాయి. 'అమ్మో.. నేను ఆ పిలగాని ఇంటర్వ్యూకు వెళ్లను. కాలికేస్తే మెడకేస్తడు.. మెడకేస్తే కాలికేస్తడు. ఏందేందో అడుగుతాడు' అంటూ కామెంట్ చేసింది. దానికి ఆమె భర్త 'మీ అన్న కూడా ఉన్నడు కదా అలీ' అని బదులిచ్చాడు. దానికి శివజ్యోతి 'వాడున్నడనే అసలు బాధ..' అంటూ షాక్ ఇచ్చింది. మొత్తంగా మొదటి ఇంటర్వ్యూ లాగే ఈ ఇంటర్వ్యూ కూడా ఫుల్ జోష్‌లో హుషారుగా సాగినట్టు కనిపిస్తోంది.First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు