Home /News /movies /

BIGG BOSS CONTASTANT SERIAL ACTOR ALI REZA BECOMING FATHER SOON NR

Bigg Boss Ali Reza: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ అలీ రెజా.. ఆ ఒక్క వీడియోతో అంత చెప్పేశాడు

Bigg Boss Ali Reza

Bigg Boss Ali Reza

Bigg Boss Ali Reza: టాలీవుడ్ బుల్లితెర, వెండితెర నటుడు అలీ రెజా గురించి అందరికీ పరిచయమే. ఈయన బుల్లితెరలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని తన గేమ్ తో, తన ఉండే విధానంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ షో తోనే అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

ఇంకా చదవండి ...
    Bigg Boss Ali Reza: టాలీవుడ్ బుల్లితెర, వెండితెర నటుడు అలీ రెజా గురించి అందరికీ పరిచయమే. ఈయన బుల్లితెరలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని తన గేమ్ తో, తన ఉండే విధానంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ షో తోనే అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. నిజానికి బిగ్ బాస్ ముందు ఈయన పరిచయం గురించి చాలా వరకు ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ తర్వాత తనేంటో తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా చిటికేసి మరి గుడ్ న్యూస్ చెప్పాడు అలీ.

    తొలిసారిగా బాలీవుడ్ సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించాడు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి అమృతం చందమామ అనే సినిమాతో 2014లో పరిచయమయ్యాడు. ఈ సినిమాతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులతో తన పరిచయాన్ని పెంచుకున్నాడు.

    వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో ప్రధాన పాత్రలో నటించాడు అలీ. ఇక సీరియల్స్ కు దూరంగా ఉంటూ సినిమాలతో బాగా బిజీ అయ్యాడు. ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. ఇక ఇటీవలే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోగా.. అలీ కి మాత్రం తన పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది.










    View this post on Instagram






    A post shared by Ali Reza (@i.ali.reza)






    ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు. తన భార్య మాసుమ్ తో కలిసి దిగిన ఫోటోలను, తనతో చేసిన వీడియోలను బాగా పంచుకుంటాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో షూట్ చేయించుకోగా.. ఆ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నాడు. అందులో తన భార్యతో కలిసి ఉండగా పెళ్లి డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చిటికేయగా తన భార్య బేబీ బంప్ తో కనిపించింది. ఇక ఈ వీడియో చూడగానే త్వరలోనే అలీ తండ్రి కానున్నాడని అర్థమవుతుంది. ఇక ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Ali reza, Bigg boss season 3, Pasupu kunkuma serial, Tollywood

    తదుపరి వార్తలు