బిగ్ బాస్ పునర్నవి షాకింగ్ సీక్రెట్.. 16 ఏళ్ల వయసులోనే..

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ కావడంతో ఆమెకు ఇప్పుడిప్పుడే సినీ అవకాశాలు పెరిగాయి. ఇటీవలే ఒక చిన్న విరామం అనే సినిమాలో నటించింది పునర్నవి. డిసెంబరు మొదటి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

news18-telugu
Updated: November 22, 2019, 3:24 PM IST
బిగ్ బాస్ పునర్నవి షాకింగ్ సీక్రెట్.. 16 ఏళ్ల వయసులోనే..
పునర్నవి (Instagram/punarnavib)
  • Share this:
పునర్నవి భూపాలం..! తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు..! బిగ్ బాస్ 3లో అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అగ్రెసివ్ ఆటిట్యూట్, రాహుల్‌తో రొమాంటిక్ ట్రాక్‌, గ్లామర్ షోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా తన కెరీర్‌కు ఉపయోగపడేలా మంచి ఫేమ్ సాధించింది. ఇక హౌస్‌లో రాహుల్ సిప్లిగంజ్‌తో క్లోజ్‌గా మూవ్ కావడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు షికారు చేశాయి. ఇటీవల ఇద్దరు కలిసి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరు మంచి స్నేహితులం మాత్రమే స్పష్టం చేశారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది పునర్నవి. 16 ఏళ్ల వయసులోనే ఫస్ట్ కిస్ టేస్ట్ చేశానని తన సీక్రెట్ బయటపెట్టింది.

రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది పునర్నవి. ఆ తర్వాత ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది పున్ను.
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ కావడంతో ఆమెకు ఇప్పుడిప్పుడే సినీ అవకాశాలు పెరిగాయి. ఇటీవలే ఒక చిన్న విరామం అనే సినిమాలో నటించింది పునర్నవి. డిసెంబరు మొదటి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సైకిల్ అనే మరో సినిమాలో యాక్ట్ చేస్తోంది పున్నూ బ్యూటీ.
First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading