వేశ్యగా మారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..

Nandini Rai: నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే బిగ్ బాస్ బ్యూటీ వేశ్యగా మారిపోయింది. స్టార్ హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ వేశ్య..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 9, 2020, 10:19 PM IST
వేశ్యగా మారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..
నందిని రాయ్ (nandini rai prostitute)
  • Share this:
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే బిగ్ బాస్ బ్యూటీ వేశ్యగా మారిపోయింది. స్టార్ హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ వేశ్య పాత్రల్లో నటిస్తుంటారు. అలాంటి పాత్ర వస్తే చేయడానికి ఎప్పుడు ముందుంటారు కూడా. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే పని చేసింది. తాజాగా నందిని రాయ్ సైతం ప్రాస్టిట్యూట్ పాత్రలో నటించింది. ఈమె ప్రస్తుతం సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తుంది. అక్కడే వరస అవకాశాలు కూడా వస్తున్నాయి.
నందిని రాయ్ (nandini rai prostitute)
నందిని రాయ్ (nandini rai prostitute)


అందుకే బుల్లితెరపైనే ఫిక్స్ అయిపోతుంది నందిని. ఇప్పుడు కూడా ఈమె సంచలన పాత్రతో వస్తుంది. మెట్రో కథలు అనే వెబ్ సిరీస్‌లో నందిని వేశ్యగా నటించింది. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దీనికి దర్శకుడు.

అల్లు అరవింద్ ఆహా యాప్‌లో ఇది ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో నందిని రాయ్ కూడా చాలా బోల్డుగా నటించింది. సిన్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, రాజీవ్ కనకాలతో పాటు మరికొందరు పాపులర్ నటులు కూడా ఇందులో నటించారు. ఏదేమైనా కూడా నందిని రాయ్ కారెక్టర్ మాత్రం కచ్చితంగా సంచలనం అయ్యేలా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: August 9, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading