Monal Gajjar: చిరంజీవి- రోజా సూపర్ హిట్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన మోనాల్

monal gajjar instagram

Monal Gajjar- Dancee Plus: బిగ్‌బాస్ 4లో పాల్గొని మ‌రింత క్రేజ్‌ని సంపాదించుకున్నారు న‌టి మోనాల్. ఈ రియాలిటీ షోలో గ్రాండ్ ఫినాలే ముందు వారం వ‌ర‌కు మోనాల్ హౌజ్‌లో కొన‌సాగారు. అంతేకాదు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ బ్యూటీకి వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. మొద‌టగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసిన మోనాల్

  • Share this:
    Monal Gajjar- Dancee Plus: బిగ్‌బాస్ 4లో పాల్గొని మ‌రింత క్రేజ్‌ని సంపాదించుకున్నారు న‌టి మోనాల్. ఈ రియాలిటీ షోలో గ్రాండ్ ఫినాలే ముందు వారం వ‌ర‌కు మోనాల్ హౌజ్‌లో కొన‌సాగారు. అంతేకాదు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ బ్యూటీకి వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. మొద‌టగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసిన మోనాల్.. ఆ త‌రువాత స్టార్ మాలో ప్రసార‌మైన డ్యాన్స్ ప్ల‌స్ రియాలిటీ షోకు ఒక జ‌డ్జిగా స్థానం సంపాదించుకున్నారు. అలాగే హౌజ్‌లో ఆమె బెస్ట్ ఫ్రెండ్ అఖిల్‌తో క‌లిసి తెలుగబ్బాయి- గుజ‌రాతీ అమ్మాయి అన్న వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు. ఇలా మొత్తానికి బిజీ బిజీగా గ‌డిపేస్తుంది మోనాల్.

    కాగా డ్యాన్స్ ప్ల‌స్ షోలో జ‌డ్జిగా ముందు నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్న మోనాల్.. అప్పుడ‌ప్పుడు డ్యాన్స్ స్టెప్పుల‌తోనూ అద‌ర‌గొట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా కూడా బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్‌తో క‌లిసి చిరంజీవి పాట‌కు స్టెప్పులు ఇర‌గ‌దీసింది మోనాల్. ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌ల అయ్యింది.



    అందులో చిరంజీవి-రోజా సూప‌ర్ హిట్ పాట మావ‌.. మావ‌.. మావ‌కు బాబా మాస్ట‌ర్‌తో క‌లిసి డ్యాన్స్‌లు వేసింది మోనాల్. చీర క‌ట్టుతో తెలుగ‌మ్మాయిలా వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆ మాస్ పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇక ఈ ప్రోమోలో జియా కూడా చార్లీ చాప్లిన్‌గా అద‌రగొట్టేసింది. అలాగే పంజా చిత్రంలోని వేయ్‌రా చెయ్యి వేయ్‌రా పాట‌కు బాబా భాస్క‌ర్,య‌శ్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్ ఒక‌సారి అనీ, ముమైత్ ఖాన్, మోనాల్‌లు ఒక‌సారి డ్యాన్స్ వేసి ఆక‌ట్టుకున్నారు. ఇక ఈ ప్రోమోను చూస్తుంటే ఈ వారం డ్యాన్స్ ప్ల‌స్ మ‌రింత ఆక‌ట్టుకోనున్న‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published: