• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS BEAUTY DEEPTHI SUNAINA SHARES HER LOVER SHANMUKH PHOTO WITH MESSAGE MNJ

Deepthi Sunaina- Shanmukh: షణ్ముక్ ఫొటోను షేర్ చేస్తూ దీప్తి సున‌య‌న స్పెష‌ల్ మెసేజ్

Deepthi Sunaina- Shanmukh: షణ్ముక్ ఫొటోను షేర్ చేస్తూ దీప్తి సున‌య‌న స్పెష‌ల్ మెసేజ్

దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ (deepthi sunaina shanmukh jaswanth)

Deepthi Sunaina- Shanmukh: యూట్యూబర్‌గా మంచి పేరును సంపాదించుకున్న ష‌ణ్ముక్.. డ‌బ్‌స్మాష్‌ల‌తో ఫేమ‌స్ అయిన దీప్తి సున‌య‌న ప్రేమలో ఉన్న విష‌యం తెలిసిందే. డ‌బ్‌స్మాష్‌లు చేసే స‌మ‌యం నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం మొద‌లైంది. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్‌ వీడియోలు చేసేవారు. ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది

  • Share this:
    Deepthi Sunaina- Shanmukh: యూట్యూబర్‌గా మంచి పేరును సంపాదించుకున్న ష‌ణ్ముక్.. డ‌బ్‌స్మాష్‌ల‌తో ఫేమ‌స్ అయిన దీప్తి సున‌య‌న ప్రేమలో ఉన్న విష‌యం తెలిసిందే. డ‌బ్‌స్మాష్‌లు చేసే స‌మ‌యం నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం మొద‌లైంది. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్‌ వీడియోలు చేసేవారు. ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది. అంతేకాదు ఆ ప్రేమ‌కు గుర్తుగా ఇద్ద‌రు చేతుల‌పై టాటూలు కూడా వేసుకున్నారు. కాగా దీప్తి బిగ్‌బాస్‌లోకి వెళ్లిన స‌మ‌యంలో వీరిద్ద‌రిపై ఎన్నో మీమ్‌లు వ‌చ్చాయి. అయితే హౌజ్‌లోకి వెళ్లిన త‌రువాత దీప్తి, న‌టుడు త‌నీష్‌తో క్లోజ్‌గా ఉండ‌టంతో.. ష‌ణ్ముక్ హ‌ర్ట్ అయ్యాడ‌ని టాక్ న‌డిచింది. అంతేకాదు బిగ్‌బాస్ నుంచి వ‌చ్చిన త‌రువాత వీరిద్ద‌రు పెద్ద‌గా క‌ల‌వ‌క‌పోవ‌డంతో.. ఆ పుకార్ల‌కు మరింత బలం చేకూరిన‌ట్లైంది.

    అయితే ఆ త‌రువాత దీప్తితో త‌న రిలేష‌న్‌పై త‌నీష్ క్లారిటీ ఇచ్చారు. ఆమె త‌న‌కు చెల్లెలులాంటిద‌ని అన్నారు. అదంతా ప‌క్క‌న‌పెడితే.. గ‌త కొన్నేళ్లుగా దీప్తి, ష‌ణ్ముక్ మాత్రం ముందుగా ఉన్నంత క్లోజ్‌గా క‌నిపించ‌లేదు. దీంతో వీరు విడిపోయార‌నే టాక్ కూడా న‌డిచింది. అయితే ఆ మ‌ధ్య‌న త‌న వెబ్ సిరీస్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ష‌ణ్ముక్, దీప్తితో రిలేష‌న్‌పై క్లారిటీని ఇచ్చారు. త‌న చేతి మీద ఉన్న టాటూను చూపించి, ఇది పోయే వ‌ర‌కు త‌న ప్రేమ పోద‌ని అన్నాడు. దీంతో తామిద్ద‌రం ఇంకా ప్రేమ‌లో ఉన్నామ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. ఆ త‌రువాత కూడా ఓ ఆల్బ‌మ్ సాంగ్‌లో మెరిశారు. ఇక ఇటీవ‌ల కూడా స్టార్ మాలో ప్ర‌సార‌మైన 100 ప‌ర్సెంట్ ల‌వ్ ప్రోగ్రామ్‌లో రియ‌ల్ క‌పుల్‌గా మెరిశారు. కాగా ఇటీవ‌ల ష‌ణ్ముక్ వివాదంలో చిక్కుకున్నాడు.



    మ‌ద్యం తాగి డ్రైవ్ చేస్తూ మూడు వాహ‌నాల‌ను ఢీకొట్టాడు. దీంతో అత‌డిపై కేసు కూడా న‌మోదైంది. దీంతో అత‌డిపై ప‌లు న్యూస్ ఛానెళ్లు హడావిడి చేయ‌గా.. నెటిజ‌న్లు మాత్రం ష‌ణ్ముక్‌కు మ‌ద్ద‌తును ఇచ్చారు. అయితే ఆ వివాదం ఎలా ఉన్నా షణ్ముక్ మాత్రం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. త‌న ఇన్‌స్టా రీల్‌లో చిన్న‌ప్పుడు తాను చేసిన ఓ షార్ట్ ఫిలిం వీడియోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మ‌రోవైపు త‌న ల‌వ‌ర్ ఫొటోను షేర్ చేస్తూ దీప్తి ఓ మెసేజ్‌ని త‌న సోష‌ల్ మీడియాలో పెట్టింది. నీ న‌వ్వును ప్ర‌పంచం మార్చేలా చేసుకోకు. నువ్వే నీ న‌వ్వుతో ప్ర‌పంచాన్ని మార్చు అన్న మెసేజ్‌ను దీప్తి ఇన్‌స్టా రీల్‌లో పెట్టింది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు