Home /News /movies /

BIGG BOSS BEAUTY ARSHI KHAN CANCELS HER ENGAGEMENT WITH AFGHANISTAN CRICKETER HERE ARE THE DETAILS TA

Bigg Boss - Arshi Khan : అఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌తో పెళ్లి రద్దు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ..

బిగ్‌బాస్ బ్యూటీ అర్షీ ఖాన్ (Twitter/Photo)

బిగ్‌బాస్ బ్యూటీ అర్షీ ఖాన్ (Twitter/Photo)

Bigg Boss - Arshi Khan  | అఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌తో పెళ్లి రద్దు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. వివరాల్లోకి వెళితే.. 

    Bigg Boss - Arshi Khan  | అఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌తో పెళ్లి రద్దు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. వివరాల్లోకి వెళితే..  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరు మాట్లాడుకుంటున్న ముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే.. అది తాలిబన్లు అఫ్ఘనిస్థాన్‌కు ఆక్రమించడం. తాలిబన్లు.. గత పది రోజులుగా అఫ్ఘనిస్థాన్‌ను పూర్తిగా కబలించారు. అంతేకాదు ముస్లిమ్ మహిళలను బానిసలుగా చేస్తూ వీళ్లు చేస్తోన్న అరాచకం మాములుగా లేదు. తాము అమలు చేయాలనుంటున్న షరియా చట్టాలకు అంగీకరించని వాళ్లను నిర్ధాక్షణ్యంగా కాల్చిపారేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజలు స్వేచ్ఛ కోసం ఇతర దేశాలకు వలస పోతున్నారు. అఫ్ఘనిస్థాన్ ఘటనతో మన దేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు అసలు స్వతంత్య్రం అంటే ఏమిటో తెలిసొచ్చిందనే చెప్పాలి. తాజాగా అఫ్ఘనిస్థాన్‌లో జరుగుతోన్న ఈ పరిణామాలు .. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అఫ్ఘన్‌లో జరగుతున్న పరిణామాలతో బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ అర్షీ ఖాన్ తన వివాహా నిశ్చితార్ధం అక్టోబర్‌లో జరగాల్సి ఉంది.

    అయితే.. ఈ ఎంగేజ్మెంట్‌ను సదరు నటి క్యాన్సిల్ చేసుకుంది. నిశ్చితార్ధం ఆగిపోయినా.. మేము ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉంటానమని చెప్పుకొచ్చింది. అఫ్ఠన్‌లోని పరిణామాలే ఈ వివాహా నిశ్చితార్ధం క్యాన్సిల్ కావడానికి అసలు కారణమని తెలియజేసింది. ఈ సందర్భంగా అర్షీ ఖాన్ మాట్లాడుతూ.. తమ ఫ్యామిలీకి అప్ఘనిస్థాన్ మూలాలున్నాయన్నారు. తమ కుటుంబం యూసుఫ్ జాయ్ జాతి అని తెలిపింది. అంతేకాదు నేను భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే.. భారతీయుడినే చేసుకుంటానని స్పష్టం చేసింది.

    ఇవి కూడా చదవండి.. 

    Evaru Meelo Koteeswarulu - Jr NTR : ఎన్టీఆర్ షోలో రానా సాయం తీసుకున్న రామ్ చరణ్..


    Nagarjuna - Ram Charan: ఆ తరంలో నాగార్జున.. ఈ జననరేషన్‌లో రామ్ చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది..


    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..


    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Afghanistan, Bigg Boss, Bollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు