బిగ్‌బాస్ హౌస్‌లో లిప్‌కిస్‌లు...వేడెక్కిస్తున్న కొత్త టాస్క్‌లు

తెలుగు బిగ్ బాస్‌కు మూడో సీజన్ రన్ అవుతుండగా, అటు హిందీలో మాత్రం ఇప్పటికే 12 సీజన్లు గడిచాయి. అంతేకాదు, తాజాగా 13వ సీజన్ కూడా ప్రారంభమైంది.

news18-telugu
Updated: October 16, 2019, 8:44 PM IST
బిగ్‌బాస్ హౌస్‌లో లిప్‌కిస్‌లు...వేడెక్కిస్తున్న కొత్త టాస్క్‌లు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
బిగ్‌బాస్ షో దేశ వ్యాప్తంగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే తెలుగుతో పాటు అన్ని భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తెలుగు బిగ్ బాస్‌కు మూడో సీజన్ రన్ అవుతుండగా, అటు హిందీలో మాత్రం ఇప్పటికే 12 సీజన్లు గడిచాయి. అంతేకాదు, తాజాగా 13వ సీజన్ కూడా ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న ఈ బిగ్ బాస్‌ రియాలిటీ షోలో బాలివుడ్ సెలబ్రిటీలతో పాటు పాప్ సింగర్స్, బుల్లితెర భామలు కూడా పాల్గొంటున్నారు. ఈ సారి బిగ్ బాస్ షోలో అమీషా పాటిల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే 13వ సీజన్ లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు మామూలు స్థాయిలో లేవనే చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఓ టాస్క్‌ను చూసి నెటిజన్లు ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. హౌస్ టీం లీడర్ ఎంపిక కోసం ఇచ్చిన టాస్క్‌లో ఇద్దరు హౌస్ మేట్స్ లిప్ కిస్ ఇచ్చుకోవడంతో ముగిసింది. టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరు తమకు కావాల్సిన వారానికి సరిపడా సామాన్లు ఒక్కో హౌస్ మేట్ నోటితో అందుకొని పక్కన ఉన్న హౌస్ మేట్‌కు పాస్ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ టాస్క్ లో కోడి గుడ్లును పాస్ చేసే సమయంలో గుడ్లు జారిపోయి రైటర్ సిద్ధార్థ్ డే, అలాగే షెహ్నాజ్ గిల్ మధ్య అనుకోకుండా లిప్ లాక్ జరిగిపోయింది. ఈ ఘటనతో పంజాబీ కట్రీనా కైఫ్ గా పేరొందిన షెహ్నాజ్ గిల్ షాక్ కు గురైంది. ఇక ఈ సీజన్లో ముందు ముందు మరెంత హీట్ ఎక్కుతుందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

First published: October 16, 2019, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading