హైపర్ ఆదికి బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ స్ట్రాంగ్ వార్నింగ్...ఎందుకో తెలిస్తే షాక్ తింటారు...

జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది (File/Photo)

యాంకర్ వర్షిణితో పీకల్లోతు ప్రేమలో బిగ్ బాస్ అభిజిత్...ఆ దెబ్బతో హైపర్ ఆది రెండు చేతులు జేబులో పెట్టుకొని నిరాశతో వెనుతిరిగాడట...ఎందుకో తెలిస్తే షాక్ తింటారు.

 • Share this:
  బుల్లితెరపై జంటలు ప్రస్తుతం చాలా ట్రెండింగ్ గా మారాయి.  ముఖ్యంగా జబర్దస్త్ లో యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య పుట్టించిన వేడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ ఒక్కటి కాకపోతే అటు ఫ్యాన్స్ కూడా ఊరుకునే పరిస్థితి లేకుండా మారింది. అందుకు తగ్గట్టే వారిద్దరి కెమిస్ట్రీని మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా బాగా వాడేసుకుంది. అటు జబర్దస్త్ లో మాత్రమే కాదు, ఢీ షోలో కూడా వీరిద్దరినీ పర్మినెంట్ హోస్ట్ లుగా క్రియేట్ చేసింది. అంతేకాదు ఓ ఈవెంట్ లో పెళ్లి కూడా చేసింది. అయితే సుడిగాలి సుధీర్ బయట తనకు రష్మీకి మధ్య ఎలాంటి ప్రేమ లేదని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ పలుమార్లు సంజాయిషీ ఇచ్చాడు. అయినప్పటికీ, సుధీర్ రష్మీ మధ్య రొమాన్స్ లేదంటే మాత్రం ఫ్యాన్స్ ఒప్పుకునే పరిస్థితి లేదు. అయితే వీరిద్దరి తర్వాత అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ఓ మోస్తారు కెమిస్ట్రీని హైపర్ ఆది, వర్షిణి కూడా క్రియేట్ చేశారు. హైపర్ ఆది, వర్షిణి ఇద్దరూ కలిసి మంచి కెమిస్ట్రీనే పండిస్తున్నారని, సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మొదట్లో అంతగా లేకపోయినప్పటికీ, హైపర్ ఆది వైపు నుంచి మాత్రం కాస్త సిన్సియర్ గానే వర్షిణిని తన ట్రాక్ లో పడేయాలని ప్రయత్నిస్తున్నట్లు నెటిజన్లు గమనిస్తున్నారు. అయితే హైపర్ ఆది విషయంలో వర్షిణి మాత్రం కేవలం అడ్వాంటేజ్ తీసుకోవాలనే అనుకుంటుంది. కానీ అంత సిన్సియర్ గా ఉండటం లేదని అందరికీ తెలిసిందే.

  నిజానికి వర్షిణి మొదటి నుంచి మోడలింగ్ రంగం నుంచి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత యాంకర్ గా స్థిరపడింది. పెళ్లిగోల రెండు వెబ్ సిరీస్ లలో నటించిన వర్షిణికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఢీ షోలో వర్షిణి, హైపర్ ఆది ఇద్దరూ కలిసి పండిస్తన్న కెమిస్ట్రీ మాత్రం ఇప్పుడిప్పుడే మంచి మార్కులు సంపాదిస్తోంది.

  ఇక వర్షిణి విషయంలో హైపర్ ఆది అటు మీడియా హైప్ కు తగ్గట్టుగానే, కాస్త సీరియస్ గానే ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. వీలైనప్పుడల్లా తన ప్రేమను వర్షిణి ముందు వ్యక్తం చేసేందుకు హైపర్ ఆది అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడని అంటున్నారు. అయితే వర్షిణి మాత్రం ఇటీవల ఆలీతో సరదాగా షోలో తనకు ప్రేమ పట్ల అంత ఇంట్రెస్ట్ లేదంటూ హైపర్ ఆది ముందే చెప్పేసింది. అయితే హైపర్ ఆది మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సిన్సియర్ గా ట్రై చేస్తూనే ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

  ఇదిలా ఉంటే అటు వర్షిణి మాత్రం హైపర్ ఆదిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తాజాగా ఆమె బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఫిలిం నగర్ లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వర్షిణి విషయంలో అభిజిత్ కాస్త ఇంట్రెస్ట్ చూపుతున్నాడట, ఎందుకంటే ఇద్దరూ కలిసి పెళ్లి గోల రెండు సీజన్లలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి బంధం కంటిన్యూ అవుతోంది. మధ్యలో హైపర్ ఆది వచ్చినప్పటికీ వర్షిణి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే వర్షిణి విషయంలో సైడ్ తీసుకోమని అటు అభిజిత్ హైపర్ ఆదికి వార్నింగ్ సైతం ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ గొడవ ఎంత స్థాయికి చేరుతుందనేది కాలమే నిర్ణయించాలి.
  Published by:Krishna Adithya
  First published: