హోమ్ /వార్తలు /సినిమా /

Sakala Gunabhirama Review:‘సకల గుణాభి రామ’ రివ్యూ.. మంచి గుణాలున్నాయ్ కానీ కండీషన్స్ అప్లై..

Sakala Gunabhirama Review:‘సకల గుణాభి రామ’ రివ్యూ.. మంచి గుణాలున్నాయ్ కానీ కండీషన్స్ అప్లై..

సకల గుణాభిరామ మూవీ రివ్యూ (Twitter/Photo)

సకల గుణాభిరామ మూవీ రివ్యూ (Twitter/Photo)

Sakala Gunabhirama Review : బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ హీరోగా నటించిన సినిమా సకల గుణాభి రామ. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. సన్నీ హీరోగా నటించిన మొదటి సినిమా కావడంతో.. దీనిపై ఆసక్తిగానే ఉన్నారు ఆడియన్స్. మరి సకల గుణాభి రామలో ఆ లక్షణాలు ఉన్నాయి లేవా రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మూవీ రివ్యూ :సకల గుణాభిరామ (Sakala gunabhirama)                                              నటీనటులు: విజే సన్నీ, అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్ర తదితరులు

  సంగీతం: అనుదీప్ దేవ్

  ఎడిటర్: వెంకట్

  సినిమాటోగ్రఫర్: నలినికాంత్ కొండపల్లి

  నిర్మాత: సంజీవ్ రెడ్డి వడ్డి

  దర్శకుడు: వెలిగొండ శ్రీనివాస్

  బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ హీరోగా నటించిన సినిమా సకల గుణాభి రామ. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. సన్నీ హీరోగా నటించిన మొదటి సినిమా కావడంతో.. దీనిపై ఆసక్తిగానే ఉన్నారు ఆడియన్స్. మరి సకల గుణాభి రామలో ఆ లక్షణాలు ఉన్నాయి లేవా రివ్యూలో చూద్దాం..

  కథ:

  అభి రామ్ (వి.జే. సన్నీ) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. కాకపోతే తక్కువ జీతంతో ఉన్న మిడిల్ క్లాస్ అబ్బాయి. స్వాతి (అషిమా)ని ప్రేమించి పెళ్లాడుతాడు. సాఫీగానే జీవితం సాగుతున్నా.. వచ్చే జీతం సరిపోక వడ్డీ వ్యాపారం చేసే ప్రదీప్ (శ్రీ తేజ్) అప్పు తీసుకుని వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటాడు. ఇంట్లో ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో.. పిల్లల్ని వద్దనుకుంటారు రామ్ దంపతులు. రామ్‌కు ఇష్టం లేకపోయినా.. భార్య కోసం సేఫ్టీ వాడుతూ పిల్లలని కనడం వాయిదా వేస్తుంటారు. ఈ క్రమంలో ఓ సారి భార్య మీద అఘాయిత్యం చేస్తాడు. దాంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్లిన స్వాతి తిరిగి వచ్చిందా.. సకల గుణాభి రామా కాస్తా అలా ఎందుకు మారిపోయాడు.. పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత రామ్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ..

  కథనం, టెక్నీషియన్ విషయానికొస్తే.. 

  మిడిల్ క్లాస్ అబ్బాయిల చుట్టూ సాగే కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది జీవితాలు వీటితో ముడిపడి ఉంటాయి కాబట్టి. వెలిగొండ శ్రీనివాస్ సైతం ఇదే చేసాడు. ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్.. అందులోనూ చాలీ చాలని జీతంతో ఉండే వాడు.. వాడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా కథ. పైకి చూడ్డానికి సరదాగా ఫన్నీగా సాగిపోతుంది ఈ కథ. ఫన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా సరిగ్గా ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్. అయితే అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా.. కేవలం హీరో పనిచేసే కంపెనీ.. అందులో సాగిపోయే సరదా సన్నివేశాల నేపథ్యంలో సాగిపోతుంది కథ. అక్కడి సహా ఉద్యోగులతో, యజమానితో సరదా సరదా సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ తర్వాత పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది.. దాని వల్ల నేర్చుకునే గుణపాఠం లాంటివి చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాదు.. ఏవైనా పొరపాట్లు జరిగితే.. వాటిని క్షమించే క్షమాగుణం కూడా భార్యా భర్తలకు ఉండాలి. అప్పుడే అలాంటి బంధాలు సొసైటీలో చాలా బలంగా వుంటాయి అనే ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. అయితే మరింత బలంగా చెప్పి ఉంటే బాగుండేది. పైగా చిన్న ఆర్టిస్టులు ఉండటం.. సరైన పబ్లిసిటీ లేకపోవడం కూడా సకల గుణాభి రామకు మైనస్‌గా మారింది.

  సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ స్వరాలు అంతగా ఆకట్టుకోలేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. కథకు తగ్గట్లు బడ్జెట్ బాగానే ఖర్చు చేసారు. ఇక చివరగా దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ రాసుకున్నాడు కానీ కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంకాస్త పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాసుంటే.. కచ్చితంగా మంచి సినిమా అయ్యుండేది.

  నటీనటులు:

  వి.జె.సన్నీ నటుడిగా బాగా చేసాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా.. చిలిపి భర్తగా రెండు పాత్రల్లోనూ బాగున్నాడు. కామెడీతో పాటు అమాయకంగా ఉండే పాత్రను ఇందులో పోషించాడు. పాటల్లో డ్యాన్స్ కూడా మంచి ఈజ్ చూపించాడు. హీరోయిన్ అషిమ పాత్రకి తగ్గట్టుగా నటించింది. విలన్ భార్యగా దీపిక పాత్రలో నటించిన తరుణీ సింగ్ స్పెషల్ అట్రాక్షన్. సెకండ్ హాఫ్ లో ఆమెతో హీరో కెమిస్ట్రీ బాగానే కుదిరింది. వడ్డీ వ్యాపారి ప్రదీప్ పాత్రలో శ్రీతేజ్ కొత్తగా ఉన్నాడు. సెవెన్ ఆర్ట్స్ సరయు బోల్డ్ పాత్రలో కనిపించి మెప్పించింది. విట్టా మహేష్ కామెడీ ఓకే.

  ప్లస్ పాయింట్స్ 

  సన్ని నటన

  సినిమాటోగ్రఫీ

  మైనస్ పాయింట్స్ 

  స్క్రీన్ ప్లే

  సంగీతం

  ఎడిటింగ్

  చివరగా ఒక్కమాట: సకల గుణాభి రామ.. మంచి గుణాలున్నా కొన్ని లోపాలున్నాయి..

  రేటింగ్: 2.5/5

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bigg Boss 6 Telugu, Tollywood

  ఉత్తమ కథలు