Home /News /movies /

BIGG BOSS 5 TELUGU UPDATES AND TV ACTOR VJ SUNNY FLIRTING WITH SIRI AND LAHARI SHARI PK

Bigg Boss 5 Telugu VJ Sunny: రాగానే అమ్మాయిలతో పులిహోర కలపడం మొదలు పెట్టిన ఆ కంటెస్టెంట్..

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu)

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu)

Bigg Boss 5 Telugu VJ Sunny: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu VJ Sunny) మొదలైపోయింది.. ఎప్పట్లాగే చాలా సందడిగా 5వ సీజన్ మొదలు పెట్టారు నిర్వాహకులు. వచ్చి 10 నిమిషాలు కాలేదు అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టాడు విజే సన్నీ. దాంతో అప్పుడే మొదలెట్టావా రాజా అంటూ మనోడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైపోయింది.

ఇంకా చదవండి ...
బిగ్ బాస్ 5 తెలుగు మొదలైపోయింది.. ఎప్పట్లాగే చాలా సందడిగా 5వ సీజన్ మొదలు పెట్టారు నిర్వాహకులు. ఇప్పటి వరకు వచ్చిన కంటెస్టెంట్స్ అంతా తమకు ప్లాన్ లేదని.. గేమ్ ప్లాన్ అంటే తెలియదనని చెప్పుకొచ్చారు. ఖాళీ బుర్రతోనే గేమ్ షోకు వచ్చామని.. ఇక్కడ వచ్చిన తర్వాత లోపల ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేయాలో చూస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడ గేమ్ ఆడటం కంటే.. పులిహోర కలిపే వాళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. తొలి సీజన్ నుంచి ఇది జరుగుతుంది. ముఖ్యంగా అఖిల్, మోనాల్.. పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్లు అయితే దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు పులిహోర కలపడం కూడా బాగా రావాల్సిందే. అందుకే ఇప్పుడు వచ్చీ రాగానే పని మొదలు పెట్టాడు ఓ కంటెస్టెంట్. 5వ సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా వచ్చాడు విజే సన్నీ. టీవీలో బాగానే పాపులర్ అయిన ఈ నటుడు.. వచ్చీ రాగానే రచ్చ మొదలు పెట్టాడు.

తొలి కంటెస్టెంట్ సిరితో పాటు మూడో కంటెస్టెంట్‌గా వచ్చిన లహరి షారితో క్లోజ్‌గా మూవ్ అవ్వడమే కాకుండా వాళ్లను ఫ్లర్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వచ్చి 10 నిమిషాలు కాలేదు అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టావా రాజా అంటూ మనోడిపై సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. ఏదేమైనా కూడా బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత కచ్చితంగా అమ్మాయిలతో ఎక్కువగా క్లోజ్ అయితే కానీ వాళ్లకు బయట పాపులారిటీ రాదని ఓ అంచనాలకు వచ్చేసారంతా. అందుకే ఇప్పుడు వచ్చిన కొత్త కంటెస్టెంట్స్ కూడా అదే పని చేస్తున్నారు. మరి సన్నీ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 5 Telugu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు